ETV Bharat / state

ఆంధ్ర-ఒడిశా మధ్య ఘాట్ రోడ్డులో.. రక్షణ చర్యలు కరవు.. - ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డులో ప్రమాదం

చుట్టూ ఎత్తయిన కొండలు.. ఎటుచూసినా ఆహ్లాదకర వాతావరణం. దట్టమైన అటవీప్రాంతంలో మెలికలు తిరిగినట్లుగా ఉండే రహదారి. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర-ఒడిశా మధ్య విస్తరించిన ఘాట్ రోడ్డు ప్రత్యేకత ఇది. దీనిని చూసేందుకు సందర్శకులూ వస్తుంటారు. ఈ దారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ ఘాట్‌ రోడ్‌ నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు.

ghat road
ghat road
author img

By

Published : Jun 15, 2022, 4:33 PM IST

Updated : Jun 15, 2022, 5:15 PM IST

పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్‌ రోడ్డు కాబట్టి... ఇక్కడ ప్రయాణం చేసేటపుడు డ్రైవర్‌ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుకిరువైపులా ఎత్తయిన కొండలు, లోతైన లోయలు ఉన్నందున డ్రైవర్‌ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. వాహనం లోయలోకి దూసుకుపోతోంది. ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇలాంటి క్లిష్టమైన ఘాట్‌ రోడ్‌లో రక్షణ చర్యలు మాత్రం కరవయ్యాయి. 16 కిలోమీటర్ల ఈ ఘాట్‌ రోడ్‌లో ప్రహరీ, రెయిలింగ్‌ కరవయ్యాయి. చాలాచోట్ల గతంలో ఎప్పుడో కట్టిన ప్రహరీ శిథిలమైపోయింది. పలుచోట్ల రెయిలింగ్‌ విగిరిపోయింది.

ఆంధ్ర-ఒడిశా మధ్య ఘాట్ రోడ్డులో.. రక్షణ చర్యలు కరవు..

ఈ ఘాట్‌ రోడ్డు పలుచోట్ల గోతులమయంగా మారింది. రాళ్లు తేలింది. తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. కొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు.

ఈ మలుపుల రోడ్డులో వర్షా కాలంలో వాహనదారుల బాధలు వర్ణనాతీతం. వర్షాలకు కొండలపై నుంచి మట్టి, రాళ్లు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో ఏదైనా ప్రమాదం జరిగితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. మలుపులను డ్రైవర్లు సులభంగా గుర్తించేలా రేడియం స్టిక్కర్లు గానీ.. సైన్ బోర్డులు గానీ లేవు. అందుకే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.