Villagers Resolution to Stop Natusara: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరపల్లి గ్రామస్థులు నాటుసారా కట్టడికి నడుం బిగించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, సంఘ సభ్యులు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి.. గ్రామంలో ఎవరైనా సారా విక్రయాలు చేపడితే వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని తీర్మానం చేశారు. మొదటిసారి 10 వేల రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. ఇది పునరావృతమైతే పోలీస్ కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తాగి గొడవ పడినవాళ్లకి కూడా ఇవే నియమాలు ఉంటాయన్నారు. గ్రామంలోని ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ నాటు సారా తయారుచేసేవారికి సహాయ సహకారాలు అందించకూడదని అన్నారు.
ఇవీ చదవండి: