Tribal protest against inclusion of Boya and Valmiki in the list of STs: బోయ, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు ఆందోళన చేపట్టారు. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీ జాబీతాల్లో చేర్చడం తప్పుడు నిర్ణయమన్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల నుంచి పలు గిరిజనుల గ్రామాల ప్రజలు, గిరిజన సంఘం నాయకులు భారీగా తరలివచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ వాణి కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. కురుపాం, అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని వారు అన్నారు.
జీవో నెంబర్ 52 ను రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్ : రాష్ట్ర ప్రభుత్వం బోయ, వాల్మీకిలను ఎస్టీలో చేర్చే విధంగా కేంద్రానికి పంపించిన అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 52 ను రద్దు చేయాలని, గిరిజనులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని, నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతీ ,యువకులకు ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
" బోయ, వాల్మీకులని ఎస్టీ జాబీతాల్లో చేర్చడం అనేది తప్పుడు నిర్ణయం. ఈ వైఎస్సార్ ప్రభుత్వం తీసుకుంది. దానికి మా రిప్రసెన్టేషన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాము. లూటీ చేయడానికి గానీ, దాడులు చేయాలనే ఉద్దేశంతో గానీ, ఎమ్మెల్యే ఇంట్లో చోరబడటానికి గానీ మేము ఇక్కడకు రాలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు గమనించాల్సింది ఏమిటంటే.. మీరు ప్రత్యేకించి నక్సలైట్లను తయారు చేయడం కాదు. ఈ రకమైనటువంటి గిరిజనుజనులకు ఉన్నటువంటి హక్కుల్ని కాల రాస్తున్నారు కాబట్టి వాళ్లు ఈ రకంగా తయారవ్వడానికి అవకాశాలు చూపిస్తున్నారు. ఉద్యమాల వైపు ప్రేరేపిస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయడానికే మిమ్మల్ని ఎన్నుకున్నాం అని గుర్తుంచుకోవాలి. గిరిజనులకు అన్యాయం చేయమని గానీ, దొంగ సంతకాలు పెట్టి గిరిజనులను మోసం చేయాలని మేము మిమల్ని ఎన్నుకోలేదు. " - భారతమ్మ, ఆదివాసీ జేఏసీ నాయకురాలు
" బోయ, వాల్మీకులను గిరిజనులలో కలుపుతామనీ తీర్మానం చేశారు. అది అనాగరిక చర్య. చాలా దారుణం. దాన్ని పూర్తిగా మేము ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ వికాస పరిషత్ ముక్త కంఠంగా ఖండిస్తుంది. గిరిజన ఓట్లతో గెలిచి, గిరిజనులకు అన్యాయం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు." - సత్య నారాయణ, ఆదివాసీ జేఏసీ నాయకుడు
ఇవీ చదవండి