ETV Bharat / state

మాచర్ల పోలీసులపై యరపతినేని ఫైర్..భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు - macharla news

Yarapatineni fire on Macharla police: మాచర్ల పోలీసులు టీడీపీ శ్రేణుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఇక ఉద్యోగాలుండవని హెచ్చరించారు.

Yarapathineni
నిర్బంధాలు ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది
author img

By

Published : Dec 21, 2022, 2:18 PM IST

Yarapatineni fire on Macharla police: ''నిర్బంధాలు ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలి. ఆరిపోయే దీపం లాంటి వైసీపీ ప్రభుత్వంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి చేయిస్తున్న అఘాయిత్యాలు ఎంతో కాలం సాగవు.'' అని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచర్ల పట్టణంలో తాజాగా జరిగిన దాడులకు సంబంధించి మాచర్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

మాచర్ల పోలీసులపై యరపతినేని ఫైర్

టీడీపీకీ చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను పోలీసులతో పిన్నెలి కొట్టిస్తున్నారని యరపతినేని ఆరోపించారు. తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఇక ఉద్యోగాలుండవని స్పష్టం చేశారు. బరితెగించిన మాచర్ల పోలీసుల్ని డీజీపీ అదుపులో పెట్టకపోతే, వారి పరిస్థితి ఇక ఆగమ్యగోచరమేనని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించి ఆయా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిర్బంధాలకు, అఘాయిత్యాలకు తెలుగుదేశం నేతలెవ్వరూ భయపడట్లేదు. వారికి పార్టీ అండగా ఉంటుంది. మాచర్ల పోలీసులు అమాయకులైన టీడీపీ శ్రేణులపై మూడు రోజులుగా అక్రమ కేసులు పెట్టి, చిత్ర హింసలు పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని అక్రమంగా వెల్దుర్తి, సాగర్ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి వారిని తీవ్రంగా కొడుతున్నారు. కులం పేరుతో మతం పేరుతో ఇష్టారాజ్యంగా బరితెగిస్తే, మాచర్ల పోలీసులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.- యరపతినేని శ్రీనివాసరావు, తెదేపా సీనియర్ నేత

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.