Land Disputes: 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిపై.. తమ్ముడు వేట కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో చోటు చేసుకుంది. రాట్నాల మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు సోదరుల పేరిట 30 సెంట్ల స్థలం ఉంది. మల్లేశ్వరరావు చనిపోగా.. ఆయన కుమార్తె అస్తిలో వాటాకు వస్తోందనే కోపంతో కోటేశ్వరరావు వేట కొడవలితో దాడి చేశాడు.
మాదలలో ఉండే కోటేశ్వరమ్మ శుభకార్యం నిమిత్తం వెన్నాదేవి గ్రామానికి వచ్చిందని తెలుసుకుని.. వేట కొడవలితో కోటేశ్వరరావు దాడి చేశాడు. గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వేట కొడవలితో బెదిరించాడు. కత్తి దాడికి గురైన కొటేశ్వరమ్మను స్థానికులు చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి :