Suspected Death in Palnadu District: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నవ్య శ్రీ (4) అనే చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లి మాత్రం అనారోగ్యంతో మృతిచెందినట్లు చెబుతుండగా, తండ్రి మాత్రం తల్లే ప్రియుడితో కలిసి హత్య చేసిందని అంటున్నాడు. ఈ విషయంపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన సోమరౌతు ప్రసాద్‌కు నల్గొండ జిల్లా బుగ్గ మాదారం గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నవ్య శ్రీ (4) అనే పాప ఉంది.
ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. పాప మాత్రం తల్లి ధనలక్ష్మి వద్దే ఉంటోంది. ధనలక్ష్మి స్థానిక వాలంటీర్‌తో సహజీవనం చేస్తోంది. నవ్యశ్రీ మృతి చెందిందని ధనలక్ష్మి ప్రసాద్‌కు సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చెేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి:
- 5G కాలం వచ్చేసిందోచ్.. ఇకపై అన్ని ఫాస్టే!
- Loan Apps: లోన్ యాప్ మోసాలు.. మరో ఐదుగురు అరెస్ట్
- మత్తు చూపులతో మతిపోగొడుతున్న మలయాళీ ముద్దుగుమ్మ