Lock To Village secretariat: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామ సచివాలయానికి అధికార పార్టీ నేత తాళాం వేశాడు. ఎందుకంటే ఆ గ్రామ సచివాలయంలో కొందరు ఉద్యోగులు వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో ఉంటే.. మరికొందరు వేరే కారణాల వల్ల కలెక్టర్ కార్యాలయంలో విధులకు వెళ్లారు. దాంతో అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. సిబ్బంది అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కార్యాలయ పనులు సకాలంలో చేయడం లేదని ఆయన ఆగ్రహించారు. అందులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ని బయటకు పంపి తాళం వేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆయనకు నచ్చజెప్పారు. సంక్షేమ సహాయకునితో పాటు మిగతా సిబ్బందిని విధులకు హాజరుపరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన ఆయన తలుపులు తెరిచాడు.
అందులో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ సహాయకున్ని, వీఆర్ని కలెక్టరేటకి, ఆరోగ్య కార్యకర్తని జీజీహెచ్‌కు వలసపై ఉన్నతాధికారులు పంపారు. మహిళ పోలీసు సెలవు పెట్టారు. ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్న నాదెండ్ల పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. దీంతో ఇంజినీరు సహాయకుడు ఒక్కరే సచివాలయంలో ఉన్నారు. జిల్లా పాలనాధికారి ఆదేశం మేరకే చిరుమామిళ్ల సచివాలయ సిబ్బందిని కలెక్టరేట్ విధులకు పంపామని ఇన్ఛార్జ్ ఎంపీడీవో మోషే తెలిపారు.
ఇవీ చదవండి: