ROAD ACCIDENT: వారందరూ కుటుంబాలతో సంతోషాన్ని నింపుకొని వివాహానికి వెళుతున్న వేళ ఒక్క సారిగా రోడ్డు ప్రమాదం జరిగి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ముటుకురు గ్రామానికి చెందిన పెళ్లి బృందం వాహనంలో వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న సమయంలో ఉప్పల పాడు వద్ద జాతీయ రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న టిప్పర్ లారీ, పెళ్లి వాహనం ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఇరుక్కు పోయిన పదేళ్ల హరీష్, మూడేళ్ళ జశ్విత మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు. వాహనంలో ఉన్న పదిమందిలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి