ETV Bharat / state

ఇబ్రహీం హత్య కేసులో రాజకీయ కోణం లేదు: ఎస్పీ - Palnadu district news

Palnadu District SP Ravi Shankar Reddy Pressmeet: నరసరావుపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

ఎస్పీ
SP
author img

By

Published : Dec 23, 2022, 9:44 PM IST

Palnadu District SP Ravi Shankar Reddy Pressmeet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత రెండు రోజుల క్రితం జరిగిన ఇబ్రహీం(70) హత్యలో రాజకీయ కోణం లేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ముస్లిం వ్యక్తి ఇబ్రహీం హత్యలో రాజకీయ కోణం లేదని వెల్లడించారు. ఇబ్రహీం హత్య కేవలం మసీదు వ్యవహారంలో మనస్పర్థల కారణంగా హత్య జరిగిందని తెలిపారు. పథకం ప్రకారం ఇబ్రహీం, రహమత్ అలీలలపై దాడి చేసి ఇబ్రహీంను హతమార్చారని తెలిపారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. నిందితుల వద్ద హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

షేక్‌ ఇబ్రహీం, రహమత్ అలిలపై దాడి చేయడంలో ఎటువంటి రాజకీయ కోణం లేదు. 1985 నుంచి 2022 వరకు మసీదు వ్యవహారంలో మనస్పర్థలు, ఎన్నో సార్లు కోర్టుకు వెళ్లి కేసును వెనక్కు తీసుకున్నారు. -రవిశంకర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.