ETV Bharat / state

Nara Lokesh Meeting With YSRCP Victims in Yuvagalam: 'రాష్ట్రంలో న్యాయం బతికుందా..?'.. వైసీపీ బాధితుల సమావేశంలో లోకేశ్‌ ధ్వజం

Nara Lokesh Meeting With YSRCP Victims in Yuvagalam: బిడ్డను పోగొట్టుకున్న తల్లి.. అన్నను కోల్పోయిన తమ్ముడు, భర్త దూరమైన భార్య.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి కథ. వారి వ్యథకు మూలకారణం మాత్రం తమకు నచ్చిన పార్టీలో ఉండటం, పసుపు జెండా పట్టుకోవడం, అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి.. పార్టీ మారకుండా.. వైసీపీ నాయకుల అరాచకాలను ప్రశ్నించడమే. అందుకే.. వైసీపీ నేతలు వారిపై పగబట్టారు. వెంటాడి వేధించారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ చేస్తున్న దాష్టీకాలను లోకేశ్‌కు చెప్పుకుని.. బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.

Nara_Lokesh_Meeting_With_YSRCP_Victims
Nara_Lokesh_Meeting_With_YSRCP_Victims
author img

By

Published : Aug 11, 2023, 7:12 AM IST

Nara Lokesh Meeting With YSRCP Victims in Yuvagalam: పసుపు జెండా పట్టుకున్నందుకు పగపట్టారు. బిడ్డను పోగొట్టుకున్న తల్లి.. అన్నను కోల్పోయిన తమ్ముడు, భర్త దూరమైన భార్య.. ఒక్కొక్కరిది ఓ కథ. కానీ ఆ కథకు, వారి వ్యథకు మూలకారణం మాత్రం పసుపు జెండా పట్టుకుని నడవటమే. తెలుగుదేశంలో ఉండి అధికార పార్టీ అరాచకాల్ని ప్రశ్నించటమే వారు చేసిన పాపం. వైసీపీ నేతల చేతిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయినవారు, గాయపడిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారు తరలివచ్చి నాలుగు సంవత్సరాలుగా పడుతున్న నరకాన్ని నారా లోకేశ్​కు వివరించారు. దొడ్లేరులో లోకేశ్​తో ముఖాముఖిలో పాల్గొని.. తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Nara Lokesh Yuvagalam padayatra: 'సైకో పోవాలి సైకిల్‌ రావాలి'.. గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపిన లోకేశ్ పాదయాత్ర..

Nara Lokesh Face to Face With YSRCP Victims: పల్నాడు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేశ్.. దొడ్లేరులో వైసీపీ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కన్నీటి సుడులతో తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు వెళ్లగక్కారు. గురజాల నియోజకవర్గం తంగెడ గ్రామానికి చెందిన తమ అమ్మ తెలుగుదేశం పార్టీలో ఉందనే అక్కసుతో.. వైసీపీ నాయకులు గొడ్డలితో నరికి.. నోట్లో పురుగుల మందుపోసి చంపారని శేషమ్మ వాపోయారు. జంగమహేశ్వరపాడుకు చెందిన ఎల్లయ్య దంపతులు.. తమ కుమారుడు కంచర్ల జాలయ్యను వైసీపీ నేతలు చంపేశారని లోకేశ్‌ ముందు కన్నీరుమున్నీరయ్యారు..

Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: కొన్ని నెలలు ఓపిక పట్టండి.. క్యాష్ మహేష్​ను పిల్లి మహేష్​ చేస్తాం: లోకేశ్

Lokesh Meeting With TDP Followers: పది రోజుల క్రితం కారంపూడి పట్టణంలో మండల పార్టీ అధ్యక్షున్ని వైసీపీ నేతలు కొట్టారని, ఫిర్యాదు చేయడానికి వెళ్తే తామే కొట్టడానికి వచ్చామని కేసులు పెట్టారని మాచర్లకు చెందిన అన్వర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో లేకపోయినా తనపైనా 14వ ముద్దాయిగా కేసు పెట్టారని, బక్రీద్​కు ముందు రోజు కేసు పెట్టారని వాపోయారు. తాము స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నట్లు అనిపిస్తోందని బాషా ఆందోళన వ్యక్తం చేశారు.

Nara Lokesh Yuvagalam Padayatra in Palnadu: జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన డ్రైవర్ ను పంపించి తమ ఇంటిపై దాడి చేయించాడని, ఆ దాడిలో ఎడమ కన్ను పూర్తిగా పోయిందని కారుమంచి గ్రామానికి చెందిన సోమేపల్లి గోవర్ధన్ వాపోయారు. కుడికన్ను కూడా 30 శాతం దెబ్బతిందని, సీసీ ఫుటేజ్​లు కూడా అందించి కేసు పెట్టాలని అడిగితే పట్టించుకోలేదని వాపోయారు.

Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు నీళ్లు పారిస్తానంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు: లోకేశ్

Yuvagalam Padayatra: పంచాయతీ చేద్దామని పిలిచి తన భర్త రాజు నాయక్​ను చంపేశారని, కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోలేదని దాచేపల్లి మండలం భట్రుపాలెంకు చెందిన అచ్చిబాయి కంటతడి పెట్టుకున్నారు. తన భర్తను చంపినట్లు పోలీసులే చెప్పారని వాపోయారు. తగాదా పెట్టుకున్నామని తమ పైనే కేసు పెట్టారన్నారు. వైసీపీ కండువాలు వేసుకుంటే చేయూత వచ్చేలా చేస్తామని, వైసీపీ నేతలు తమ ఇంటిపైకి వచ్చారని, ప్రశ్నించిన తన కొడుకును ఇష్టానుసారంగా కొట్టారని 75 తాళ్లూరుకు చెందిన సుగుణమ్మ ఆరోపించారు. ఎంతో పోరాడితేకానీ నిందితులపై కేసు పెట్టలేదన్నారు.

Nara Lokesh Fires on YSRCP Government: తన తమ్ముడిని చంపేశారంటూ.. గురజాలకు చెందిన మరో బాధితుడు పిచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న తమ కోడలిపై వైసీపీ నాయకులు దాడి చేశారని పీసపాడుకు చెందిన వీరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, తమపైనే అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. బాధితుల గోడు విన్న నారా లోకేశ్‌.. అసలు రాష్ట్రంలో న్యాయం బతికుందా అనే అనుమానం వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.