ETV Bharat / state

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేకు షాక్.. 'గోబ్యాక్ ఎమ్మెల్యే' అంటూ పోస్టర్లు - Parade in Muslim bazaars

MLA Gadapa Gadapa program: గురజాల ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు.. సొంత నియోజకవర్గం వాసులు. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు..'గోబ్యాక్ ఎమ్మెల్యే' పోస్టర్లు స్వాగతం పలికాయి. కొన్ని ఇళ్లకు టీడీపీ పార్టీ జెండాలను చూసి, అటువైపు వెళ్ళకుండా వెళ్లిపోయారు. మరికొన్ని కుటుంబాలు ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసి.. లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

MLA Gadapa Gadapa program
MLA Gadapa Gadapa program
author img

By

Published : Jan 23, 2023, 3:58 PM IST

Updated : Jan 23, 2023, 10:02 PM IST

MLA Gadapa Gadapa program: ఆదివారం జరిగిన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్​రెడ్డికి వరుస షాక్​లు తగిలాయి. ఉదయం ముస్లిం కాలనీలో కార్యక్రమం మొదలుపెట్టగా.. కాలనీలో సౌకర్యాలపై ముస్లిం కమిటీ నిరసన వ్యక్తం చేసింది. సచివాలయం 2 పరిధిలోని కాలనీల్లో గోడలపై 'గోబ్యాక్ ఎమ్మెల్యే' అంటూ పోస్టర్లు అతికించారు. 'ఏ నైతిక హక్కుతో మీరు అమరావతి. ముస్లిం కాలనీకి వస్తున్నారు..? రోజువారీ పనులు చేసుకునే ముస్లిం యువతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు... 307 కేసు బనాయించినందుకా..? పేద ముస్లింల పెన్షన్ తొలగించినందుకా..?, షాదీఖానాకు ఒక్క ఇటుక కూడా ఇవ్వనందుకా..? షాదీ తోఫా ఇవ్వనందుకా..?, ముస్లిం యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనందుకా..?... వైసీపీ ప్రభుత్వం ఏమిచ్చిందని మా ఇళ్లకు వస్తారు' అంటూ పోస్టర్లను అంటించారు.

ఈ పోస్టర్లను చూసిన వైసీపీ నేతలు ఇతర అధికారులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులను పంపించి ఆ పోస్టర్లను తొలగింపజేశారు. ఇదే క్రమంలో భారీ స్థాయిలో పోలీసులు ముస్లిం బజార్లలో కవాతు నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని కొనసాగించారు. గురజాల 10, 11 వార్డుల్లో ఎమ్మెల్యే వంద మంది పోలీసు బందోబస్తు మధ్య గడపగడపకు వెళ్లారు. తాను బతికుండగానే చనిపోయినట్లు చూపి ప్రభుత్వ పథకాలను నిలిపివేశారని ఓ మహిళ నిలదీశారు. ఏవేవో సాకులు చూపుతూ ఎమ్మెల్యే ముందుకు సాగారు.

పోస్టర్లు అడుగడుగునా ఉండడంతో పోలీసులను పంపించి వాటిని తొలగింపజేశారు. ఇదే క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యే పోస్టర్లను చూసి ప్రజలను పలకరించకుండానే ముస్లిం బజార్లలో కవాతు నిర్వహించారు. ఎమ్మెల్యే వార్డుల్లోకి రాగానే.. ముఖంమీదే తమ తమ ఇళ్లకు తలుపులు వేసుకొని లోపలికి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 23, 2023, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.