PULICHINTALA: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం వద్ద కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర జలవనరుల శాఖా అంబటి రాంబాబు... పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో కలసి నీటిని విడుదల చేశారు. 14వ నంబరు గేటును ఒక మీటరు మేర ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: