ETV Bharat / state

పల్నాడులో వేసవి తాగునీటి కష్టాలను తీర్చేందుకు.. చెరువులను నింపేందుకు ప్రయత్నాలు - డీఈ

measures to avoid drinking water problems: పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం తాగునీటి చెరువులను నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్​డబ్ల్యూఎస్ ఆర్ ఎస్ ఆర్ అధికారి సురేష్ తెలిపారు. సవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాష్ పోగ్రాం ద్వారా జిల్లాలోని అన్ని మంచినీటి చేతిపంపులు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టేలా డీఈలు, ఏఈలు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.

drinking water problems
పల్నాడు జిల్లా
author img

By

Published : Apr 1, 2023, 11:03 PM IST

water supply in Palnadu district: వేసవి వచ్చిందంటే చాలు పల్నాడు జిల్లాలోని ఆయా గ్రామల్లో ప్రజలకు నీటి తిప్పలు తప్పవు. అయితే అధికారులు ఈ సారి ముందుగా స్పందించారు. రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తుగా చెరువులను నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటుగా.. అందుకు తగ్గట్టుగా నిత్యం పర్యవేక్షిస్తూన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఎస్ ఆర్​ సురేష్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం 148 తాగునీటి చెరువులను నింపేందుకు గత పదిహేను రోజులుగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని ఆర్​డబ్ల్యూఎస్ ఆర్ ఎస్ ఆర్ సురేష్ తెలిపారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద పూర్తి సామర్ధ్యంతో నిండిన తాగునీటి చెరువును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సురేష్ మాట్లాడుతూ జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని వేల్పూరు, తాళ్లూరు చెరువులు కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ నీటితో నింపుతున్నామని తెలిపారు. అవి పూర్తయితే మొత్తం 148 చెరువులు నిండినట్లేనన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాష్ పోగ్రాం ద్వారా జిల్లాలోని అన్ని మంచినీటి చేతిపంపులు మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకువచ్చామన్నారు. తాగునీటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టేలా డీఈలు, ఏఈలు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని సురేష్ వెల్లడించారు.

గ్రామాలలో ఎటువంటి మంచినీటి ఎద్దడి వచ్చినా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ప్రజల సౌకర్యార్ధం ఫోన్ నెంబరు మానిటరింగ్ సెల్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి తాగునీటి ఇబ్బంది ఉన్నా 08647-296574కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులు, స్పందన, పత్రికల్లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే వేసవి నీటి ఎద్దడి నివారణకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రధానంగా బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాలలో భూగర్భజలాలు అడుగంటే అవకాశం ఉన్నందున అవసరమైతే ఎప్పటికప్పుడు తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్నటు తెలిపారు. ఆయనతోపాటు డీఈ అనిల్ కుమార్, ఏఇ శ్రీనివాసరావులు ఉన్నారు.

జిల్లాలో అన్ని చెరువుల్లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న మంచినీటి పంపులకు సంబందించిన మరమత్తులు పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. మంచినీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. భూగర్భ జలాలకు సంబందించిన సమస్యలు ఉన్న ప్రాంతాలను గమనించి అందుకోసం రూ.2కోట్లు కేటాయించాం. సురేష్, ఆర్ ఎస్ ఆర్

148 తాగునీటి చెరువులను నింపేందుకు ప్రణాళిక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.