TPCC WhatsApp Group : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్.. పీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు. ఈ గ్రూప్ నుంచి తాను తప్పుకున్నట్టు కథనాలు వచ్చిన కాసేపటికే మాణిక్కం ఠాకూర్.. అది వాస్తవమేనని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి మాణిక్కం ఠాకూర్ తప్పుకుంటారనే ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ కథనాలను తోసిపుచ్చిన ఏఐసీసీ ప్రతినిధి బోసురాజు.. మాణిక్కం ఠాకూర్ ఏఐసీసీ వాట్సాప్ గ్రూప్‌లో కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా.. మాణిక్కం ఠాగూర్ ఉన్నట్టు తెలిపారు.
ఇవీ చూడండి: