ETV Bharat / state

భార్యపై అనుమానం.. సుత్తితో కొట్టి చంపిన భర్త.. ఆ తర్వాత - narasaraopeta news

Husband killed his wife: పల్నాడు జిల్లా నరసరావుపేటలో.. భార్యను సుత్తితో కొట్టి భర్త హత్య చేశాడు. స్థానిక మార్కెట్‌ సెంటర్‌ వద్దనున్న రైల్వే ట్రాక్‌ పై ఈ ఘటన జరిగింది. భార్యపై అనుమానంతోనే భర్త వెంకట్రావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య పద్మను హత్యచేసిన అనంతరం భర్త వెంకట్రావు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Husband killed his wife
సుత్తితో కిరాతకంగా కొట్టి చంపిన భర్త
author img

By

Published : Oct 12, 2022, 4:51 PM IST

Husband killed his wife: పల్నాడు జిల్లా నరసరావుపేటలో భార్యను సుత్తితో కొట్టి భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మార్కెట్ సెంటర్​లోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త తమ్మిశెట్టి వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. వెంకట్రావును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.

భార్యాభర్తలు నరసరావుపేట మండలం గురవాయిపాలెంకు చెందినవారిగా రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రోసూరు మండలం అందలూరుకు చెందిన తమ్మిశెట్టి వెంకట్రావు నరసరావుపేట మండలం గురవాయిపాలెంకు చెందిన పద్మను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. పద్మ కుటుంబ సభ్యులు ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు. ఆమెను కాపురానికి పంపించాలని వెంకట్రావు నరసరావుపేటలోని తన భార్య బంధువులను కోరాడు. కానీ వాళ్ళు మీ అమ్మ, నాన్నలను తీసుకువచ్చి మాట్లాడాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్నాడు వెంకట్రావు. కూలి పనులకు వెళ్తున్న తన భార్యతో రైల్వే ట్రాక్ వద్ద గొడవ పడ్టాడు. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో ఆవేశంలో.. పద్మ తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.