ETV Bharat / state

పల్నాడులో వీకర్స్​ సొసైటీ భూముల కోసం అన్నదాతల నిరసన

Farmers Protest Against Govt: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడపల్లి వద్ద వీకర్స్ సొసైటీకి చెందిన భూములు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ రైతులకే దక్కాలని కౌలురైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. మైనింగ్ పేరుతో ఏపీఎంఐడీసీ స్వాధీనం చేసుకున్న వీకర్స్ సొసైటీ భూముల్లో కాలనీ రైతులు, రైతుసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని జెండాలు పాతి నిరసన తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా కళామందిర్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్మోహన్​రెడ్డి ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు వారికే దక్కేలా అన్ని చర్యలు తీసుకుంటామని వేలాదిమంది ప్రజల సమక్షంలో మాట ఇచ్చి మడమతిప్పి ప్రభుత్వం పేదల భూములను కొల్లగొడుతోందని రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రైతులు
Farmers
author img

By

Published : Dec 12, 2022, 1:11 PM IST

భూముల కోసం వీకర్స్ సొసైటీ నిరసన

Farmers Protest Against Govt: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడపల్లి వద్ద వీకర్స్ సొసైటీకి చెందిన భూములు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ రైతులకే దక్కాలని కౌలు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. వద్ద మైనింగ్ పేరుతో ఏపీఎంఐడీసీ స్వాధీనం చేసుకున్న వీకర్స్ సొసైటీ భూముల్లో కాలనీ రైతులు, రైతుసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని జెండాలు పాతి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతులతో కలసి కౌలురైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో భూములలో జెండాలు పాతి భూ పోరాటాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మంత్రి రజిని దళితులకు ఇచ్చిన భూములలో మైనింగ్ ఉందని, రూ.8.3లక్షలకే బెదిరించి వైసీపీ అగ్ర నాయకులకు 250 ఎకరాలను కట్టబెట్టిందని విమర్శించారు. ఇదే గ్రామంలో జగనన్న కాలనీ కోసం ఎకరాకు రూ. 25 లక్షల చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం పేద రైతులకు మాత్రం రూ.8.3లక్షలు ఇవ్వడం దుర్మార్గమన్నారు.

పెత్తనందారుల భూములకు ఒక రేటు, దళితుల భూములకు మరొక రేటు అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. మైనింగ్ భూములను వైసీపీ అగ్ర నాయకులకు కట్టబెట్టి రజిని మంత్రి పదవి తెచ్చుకుని దళితుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మికసంఘం కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనింగ్ భూములను సీఎం జగన్మోహన్​ రెడ్డి, అతని సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలకు అప్పజెప్పి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను రోడ్డున పడవేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా దళితుల భూములను దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయకుమార్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి రవికుమార్, యడవల్లి ఎస్సీ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.