Palnadu crime News: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెంకు చెందిన ఆకుల లక్ష్మయ్య (73).. తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లున్నారు. మార్గం మధ్యలోని ఎన్ఎస్పీ కాలువ దాటే క్రమంలో కాలుజారి అందులో పడిపోయారు. ఈత రాకపోవడంతో చాలా దూరం నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. చాలా సమయం తరువాత అటుగా వెళ్తున్న రైతులు కాలువలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామీణ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుమార్తె వేమూరి అనూరాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: Today Crime In AP: నెల్లూరులో దొంగనోట్ల ముఠా అరెస్ట్..