Fake documents: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న దొప్పలపూడి శ్యామ్ ప్రసన్నకుమార్, శాఖమూరి వెంకట రామారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ యూనివర్సిటీలలో చదివి ఫెయిలైన విద్యార్థుల వద్ద భారీ మొత్తంలో నగదు వసూళ్లు చేసి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తున్నారని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నిందితులిద్దరూ పట్టణంలోని ప్రకాష్ నగర్లో రెండు సైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటు చేసి.. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారన్నారు. వీరికి సహకరిస్తున్న మరో నిందితుడు గుంటూరులో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఎన్ని కళాశాలలకు సంబంధించిన ధ్రువపత్రాలను.. ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారో విచారణ చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.
నిందితుల నుండి రెండు సెల్ఫోన్లు, ఎంబీఏ ఫేక్ సర్టిఫికెట్, మానిటర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నిందితులను పట్టుకున్నందుకు ఒకటో పట్టణ సీఐ అశోక్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: