ETV Bharat / state

నీటి కొరతతో అల్లాడుతున్న పిడుగురాళ్ల ప్రజలు..

author img

By

Published : Apr 25, 2022, 6:43 PM IST

Water Scarcity at Piduguralla: అసలే నీటి కొరతతో కటకటలాడే పల్నాడు ప్రాంతం.. వేసవి తాపానికి మరింతగా అల్లాడిపోతోంది. నీటి ఎద్దడితో ప్రజల గొంతెండుతోంది. కుళాయిలు, ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు ఏ మూలకూ చాలడంలేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే.. వచ్చే మార్చి నాటికి పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు సెలవిస్తున్నారు.

పిడుగురాళ్ల పట్టణంలో నీటి కొరత
Water shortage in piduguralla
నీటి కొరతతో అల్లాడుతున్న పిడుగురాళ్ల ప్రజలు

Water Crisis in Piduguralla: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. జనాభాకు తగ్గట్లు నీటి సరఫరా జరగడం లేదు. ఒక్కో వ్యక్తికి సగటున 135 లీటర్ల నీరు అందించాల్సి ఉండగా.. కేవలం 90 లీటర్ల వరకే సరఫరా జరుగుతోంది. పట్టణంలోని 6, 7, 11, 12, 13, 14, 23 వార్డులకు పూర్తిస్థాయిలో నీరు అందుతుండగా.. మిగతా వార్డుల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న తాగునీటి పథకం పూర్తిస్థాయి సామర్థ్యం 12.20 ఎంఎల్​డీ కాగా.. 10 పవర్‌ బోర్ల ద్వారా ప్రస్తుతం 6.32 ఎంఎల్​డీ నీరు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం 3 వేల 500 కుళాయి కనెక్షన్లు ఉండగా.. మరో 11 వేల 500 కుళాయిలు వచ్చే మార్చి నాటికి అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అప్పటిదాకా పిడుగురాళ్ల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.

సుందరయ్య కాలనీ, ఇందిరమ్మ నగర్‌, సంజీవరెడ్డి నగర్‌, శ్రీనివాస కాలనీ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా ఇంటి ముందు డబ్బాలు పెట్టి తాగునీటిని దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా వేసవిలో సమస్య తప్పడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే మార్చి నాటికి పూర్తిస్థాయిలో నీరందిస్తామని పురపాలక కమిషనర్ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఇప్పుడు సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్​ తెలిపారు. ఎప్పటికప్పుడు కంటితుడుపు చర్యలు కాకుండా తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీచదవండి: దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.