Couple commits suicide: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం దాసరిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు సేవించి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుటూరి వీర రాఘవయ్య, సుబ్బాయమ్మలకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలిద్దరికి వివాహం కాగా.. కుమారుడు, కోడలితో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. కాగా..ఇవాళ ఉదయం పొలానికి వెళ్లిన వీర రాఘవయ్య, సుబ్బాయమ్మలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వారిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అనారోగ్య సమస్యలతో తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని కుమారుడు హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం వీర రాఘవయ్య తనకున్న రెండెకరాల పొలాన్నివిక్రయించి నగదును తన వద్దే ఉంచుకున్నాడని.., ఈ విషయమై తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. కుమారుడు హరిబాబు వీర రాఘవయ్యపై చెయ్యి చేసుకోవటంతోనే దంపతులు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి