Controversy between SPF and AP Police నాగార్జునసాగర్ డ్యాం తెలంగాణ, ఏపీకి సరిహద్దుగా ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులూ భద్రతా చర్యలు పర్యవేక్షిస్తుంటారు. ఈ నెల 16న క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల, గేట్ల నిర్వహణ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ ఎస్సై డ్యాం పైకి వస్తుండగా డ్యాం ఎడమవైపు ఉండే ఎస్‌పీఎఫ్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో రైటు బ్యాంకు మీదుగా వెళ్లిన ఎస్‌పీఎఫ్ వాహనాల తనిఖీలు చేపట్టి తగిన కాగితాలు లేవంటూ ఏపీ పోలీసులు చలాన్లు విధించారు. ప్రతిగా ఏపీ పోలీసు సిబ్బందికి చెందిన పిల్లలు.. డ్యాం మీదుగా పైలాన్‌లోని ఓ స్కూల్‌లో విద్యాభ్యాసానికి వచ్చిపోతూండగా ఎస్‌పీఎఫ్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయాలు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పరస్పర సహకారంతో ఉండాలని సూచించినట్లు తెలిసింది. డ్యాం భద్రతా సిబ్బంది, ఏపీ పోలీసుల మధ్య అపార్థాలు తొలగిపోయాయని, ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేదని ఎస్‌ఎపీఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇవీ చదవండి: