ETV Bharat / state

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు - పార్టీ కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు - TDP NEWS

YSRCP MLAs Joined TDP Under Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో కుటుబ సభ్యులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య, రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

ysrcp_mlas_joined_tdp
ysrcp_mlas_joined_tdp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 6:52 PM IST

YSRCP MLAs Joined TDP Under Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. అనంతరం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌‌రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hundreds of YCP Workers Joined TDP: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శుక్రవారం భారీగా చేరికలు జరిగాయి. ప్రధానంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఉదయగిరి) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్‌ భవన్‌లో సందడి నెలకొంది.

ఏపీలో మార్పు మొదలైంది - జగన్ 150 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో గెలవలేరు : చంద్రబాబు

MLA Undavalli Sridevi Comments: టీడీపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ''సీఎం జగన్ నాయక్ అంటూ వచ్చి, ఖల్నాయక్ అయ్యాడు. దళితులంటే సీఎం జగన్‌కు చిన్న చూపు. దళిత ఎమ్మెల్యే అయిన నాకు వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నాలుగేళ్ల నుంచే రాజధాని అమరావతి, రైతులు, దళితుల కోసం టీడీపీ అధిష్ఠానం పోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సైకో జగన్‌ను ఓడిద్దాం-రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం.'' అని ఆమె పిలుపునిచ్చారు.

Udayagiri MLA Mekapati Comments: ఉదయగిరిలో తాను నాలుగు సార్లు గెలిచిన తనకే సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాను సీఎం జగన్ పేరు మర్చిపోయి, చాలా రోజులైందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నారా లోకేశ్ గొప్ప నాయకుడు అవుతాడని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ గెలుస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలన చేపడతారని ఆయన వ్యాఖ్యానించారు.

Nakka Anand Babu comments on Jagan: జగన్ అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడదాం : నక్కా ఆనంద్ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.