ETV Bharat / state

వైసీపీలో టికెట్‌లపై రాని స్పష్టత - వేర్వేరుగా ఉన్న పార్టీ, నేతల ఆలోచనలు - ycp candidates for 2024 elections news

YSRCP MLA and MP Candidates for Elections: రాష్ట్ర మంత్రివర్గంలోని అమాత్యులకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే స్థానాలపై.. అస్పష్టత కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న 25 మందిలో ఇప్పటికి 11 మందికే టికెట్‌పై.. వైసీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి టికెట్లు అనుమానమనే ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ స్పష్టత ఇచ్చిన స్థానాల్లోని ముగ్గురు.. తమకు ప్రత్యామ్నాయ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. వైసీపీ పెద్దలు సైతం కొందరు మంత్రుల్ని లోక్‌సభకు పోటీ చేయించాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

YSRCP_MLA_and_MP_Candidates_for_Elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 7:16 AM IST

Updated : Nov 27, 2023, 7:31 AM IST

వైసీపీలో టికెట్‌లపై రాని స్పష్టత - వేర్వేరుగా ఉన్న పార్టీ, నేతల ఆలోచనలు

YSRCP MLA and MP Candidates for Elections: గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారిలో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే స్థానాలపై.. స్పష్టత రావట్లేదు. స్థానాలు, టికెట్లపై పార్టీ ఆలోచనలు ఒకలా.. నేతల అభిప్రాయాలు మరోలా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతమున్న 25 మంది మంత్రుల్లో సగం మందికి మళ్లీ టికెట్‌ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. 11 మందికి మాత్రం ఈసారి టికెట్ల కేటాయింపుపై వైసీపీ అధిష్టానం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మిగిలినవారిలో కొందరిని ఈసారి లోక్‌సభ బరిలోకి దించాలని పార్టీ పరిశీలిస్తుండగా.. మరికొందరికి స్థానికంగా వ్యతిరేకత వల్ల టికెట్ల సంగతి తేలట్లేదు. ప్రస్తుత మంత్రుల్లో గుమ్మనూరు జయరాం, ఉష శ్రీచరణ్, విడదల రజిని, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్‌ తదితరులను.. ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని వైసీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని జయరాంకు సీఎం జగన్‌ చెప్పగా.. ఆలూరు టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని జయరాం కోరినట్లు సమాచారం. అయితే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని ప్రచారం సాగుతోంది.

Andhra Pradesh Assembly Election Notification: ఏపీలో ఎన్నికల గురించి ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా కీలక విషయాలు వెల్లడి

ఉష శ్రీచరణ్‌ను ఈసారి ఆమె సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న రాప్తాడు అసెంబ్లీ లేదా, హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. సభాపతి తమ్మినేని సీతారాంను ఎంపీగా పోటీకి దించితే ధర్మానను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా బరిలోకి దింపనున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా అవసరమైతే ఈసారి అమర్నాథ్‌ను లోక్‌సభ బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం అనకాపల్లిలో వ్యతిరేకత ఉన్నా.. అక్కడి నుంచే పోటీకి ఆయన సిద్ధమయ్యారు.

మరో మంత్రి జోగి రమేష్‌ను విజయవాడ లేదా ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించడంపై పార్టీ సర్వేలు చేయిస్తోంది. ఆయన ఈసారి మైలవరంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పార్టీ మాత్రం రమేష్‌ను అయితే ఎంపీగా.. లేదా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న పెడనలోనే పోటీకి దించాలని చూస్తోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌బాషా, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు దాడిశెట్టి రాజా, తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు తదితరులకు టికెట్లు దాదాపు ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు

వీరిలో బొత్స ఆరోగ్య కారణాల రీత్యా.. వీలైతే రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ ఈసారికి చీపురుపల్లి నుంచే బరిలోకి దిగాలని సీఎం సూచించినట్లు ప్రచారం ఉంది. మరో మంత్రి బుగ్గన తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సురేష్‌ను యర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపి నుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుందని అంశాన్ని వైసీపీ పరిశీలిస్తోంది. తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజుకు టికెట్లు దాదాపు ఖాయమేనని తెలుస్తోంది.

అయితే కొవ్వూరులో ఎస్సీల్లోనే మరో వర్గానికి టికెట్‌ ఇవ్వాల్సి వస్తే హోంమంత్రి వనితకు అక్కడ అవకాశం ఉండకపోవచ్చు. రాజన్నదొరకి మళ్లీ సాలూరు టికెట్‌ దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. నగరిలో మంత్రి రోజాకు పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు టికెట్‌ ఇస్తారా.. లేదా అన్నది తేలాలి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

లోక్​సభకు పోటీ అంటే దూరం - అసెంబ్లీకి ముందు వరసలో వైసీపీ ఎంపీలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్ల విషయం నిర్ణయించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో.. జ్ఞానేంద్రరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో నారాయణస్వామి టికెట్‌ విషయంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. మేరుగు నాగార్జున ఈసారి వేమూరులో కాకుండా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. అంబటి రాంబాబు ఈసారి మళ్లీ సత్తెనపల్లి నుంచే పోటీచేస్తానని ధీమాగా చెబుతున్నారు. అయితే పార్టీలో ఆయనకు సానుకూల పరిస్థితులు లేవు.

సత్తెనపల్లిలో ఓ ప్రధాన వర్గం నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు టికెట్లపైనా స్పష్టత రావాల్సి ఉంది. తెలుగుదేశం- జనసేన పొత్తు వీరి స్థానాలపై ప్రభావం చూపనుంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురంలో వైసీపీ ముఖ్యనేతలు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈసారి రామచంద్రాపురంలో తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని బోస్‌ గట్టిగానే పట్టుబట్టగా.. పంచాయితీ సీఎం వరకూ వెళ్లడంతో సందిగ్ధత కొనసాగుతోంది.

YCP MPs and MLAs Absent for ZP Meeting: ప్రజా సమస్యలపై పట్టింపేదీ..? జడ్పీ సమావేశానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా

Last Updated : Nov 27, 2023, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.