ETV Bharat / state

రైతులను నిలువునా ముంచేసిన వైసీపీ సర్కార్ - కరవు, తుపాను కష్టాలతో తగ్గిన పండగ జోష్ - YSRCP Ignored Farmers Promise

YSRCP Ignored Farmers Promise: కరవు, తుపాను తెచ్చిన నష్టాలతో రైతు పండుగ సంక్రాంతి అన్నదాతల లోగిళ్లలో సందడి తగ్గింది. అలాగే వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో జనం ఏమీ కొనుక్కునే పరిస్థితి లేదు. ప్రస్తుతం నిండైన సంక్రాంతి ఎక్కడైనా ఉందీ అంటే అది సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలోనే కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కోడిపందేల బరుల్లో మాత్రమే వెలుగులు కనిపిస్తున్నాయి. పేదలకు పండగ కానుకలూ లేకుండా చేసి అధికార పార్టీ వాళ్ల మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చివరికి కరవు, మిగ్‌జాం పంట నష్టానికి సంక్రాంతి నాటికి పెట్టుబడి రాయితీ ఇస్తామన్న హామీనీ మర్చిపోయారు.

YSRCP_Ignored_Farmers_Promise
YSRCP_Ignored_Farmers_Promise
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 12:14 PM IST

రైతులను నిలువునా ముంచేసిన వైసీపీ సర్కార్ - కరవు, తుపాను కష్టాలతో తగ్గిన పండగ జోష్

YSRCP Ignored Farmers Promise: సిరుల పంట ఇంటికి చేరిన వేళ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొనే రైతులు ఈసారి నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఎందుకంటే ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 31,13,477 ఎకరాలు తగ్గింది. కరవు ప్రభావం, పొడి వాతావరణం 466 మండలాల్లో ఉంటే జగన్‌ ప్రభుత్వం మాత్రం 103 మండలాలకే అని ప్రకటించింది. కరవుతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం సుమారు 23లక్షల ఎకరాలు అయితే ప్రభుత్వ లెక్కల్లో 14లక్షల ఎకరాలే అని తేల్చారు. అలాగే మిగ్‌జాంతో 22 జిల్లాల్లో 20లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ మాత్రం 6.64 లక్షల ఎకరాలే అని ప్రకటించింది. ఒక్క ఏడాదే 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. సాగు చేసిన విస్తీర్ణంలోనూ 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే రైతులు పండగ ఎలా చేసుకోగలరు? ఖరీఫ్‌లో సాగు చేసిందే తక్కువ. అందులోనూ 20లక్షల ఎకరాలకు పంటల బీమా చేయకుండా కత్తెరేశారు. గత నాలుగేళ్లలోనూ ఏటా వర్షాలు, వరదలు, కాదంటే కరవుతో రైతులు అప్పుల పాలయ్యారు. ఈ వాస్తవాల్ని అంగీకరించే మనసు ముఖ్యమంత్రి జగన్‌కి ఉందా? కరవు, తుపాను నష్టాలకు కోత పెట్టి అంతిమంగా 12 వందల 89 కోట్ల పెట్టుబడి రాయితీకి జాబితాలు తయారుచేశారు. పండగ నాటికి వాటిని విడుదల చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అదీ నిలబెట్టుకోలేదు.

వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతికి దూరమయ్యారు: మన్నవ మోహన కృష్ణ

వర్షాభావంతో వేరుశెనగ పోయింది. మిరప రైతులకూ తీరని దుఃఖమే మిగిలింది. ఆరంభంలో తీవ్ర వర్షాభావం, తర్వాత జెమిని వైరస్‌, ఇటీవల మిగ్‌జాంతో మిరప రైతులు ఎకరాకు 1.50లక్షల నుంచి 2లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి కోల్పోయారు. కొన్నిరోజులుగా ధరల పతనం వెంటాడుతోంది. క్వింటాలు 20 వేల నుంచి 30వేల రూపాయల మధ్యన పలికిన మిరప ఇప్పుడు 17వేల రూపాయల దిగువకు చేరింది. పత్తి రైతుల కష్టాలూ సర్కారుకు పట్టడం లేదు. మద్దతు ధర క్వింటాలుకు 7 వేల 20 రూపాయల ఉంటే, దక్కేది సగటున 6వేల రూపాయిలే. తీవ్ర వర్షాభావంతో దిగుబడులు ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లే. ఎకరాకు 30వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతుకు మిగిలేదేమీ లేదు. మిగ్‌జాంతో కోతకొచ్చిన వరి నేల కరిచింది. చాలాచోట్ల మొలకలొచ్చాయి. ఎలాగోలా కోయించి అమ్ముకుందామన్నా క్వింటాలుకు 4 నుంచి 6 కిలోల కోత తప్పడం లేదు. రైతును అడ్డంగా దోచేస్తున్నా తుపానుతో నష్టపోయిన అన్నదాతకు అండగా నిలిచామంటూ జగన్‌ సర్కారు చెప్పుకొస్తోంది.

రైతులు, నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం: కొల్లు రవీంద్ర

పంటలు బాగుంటేనే వ్యవసాయ కూలీల ఇళ్లలోనూ పండగ సంతోషం నెలకొంటుంది. ఈ ఏడాది 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయకపోతే ఎకరానికి 40 మంది చొప్పున చూసినా 12కోట్లకు పైగా పనిదినాలు తగ్గినట్లే. పంట నష్టం, దిగుబడుల తగ్గుదల కూడా కూలీలపై ప్రభావం చూపింది. సుమారు 4 కోట్ల పనిదినాలు తగ్గాయి. రాయలసీమ జిల్లాల నుంచి లక్షల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలసపోయాయి. రైతులు, కూలీలు ఎలా బతుకుతారన్న ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి ఇసుమంతైనా లేదు.

తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం జగన్​ విఫలం : టీడీపీ నేతలు

Essential Commodities Prices Increased in YSRCP Government: వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేద కుటుంబాలపై విద్యుత్తు ఛార్జీల బాదుడు 40 శాతం పైనే ఉంది. బస్సు ఛార్జీలూ 49శాతం పెంచేశారు. అలాగే వచ్చాక 38శాతం బియ్యం ధరలు పెరిగాయి. అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయని సమీక్షించలేదు. లక్షల టన్నుల్లో పెట్టిన ధాన్యం నిల్వలను నియంత్రిస్తే ధరలు దిగివస్తాయనే ఆలోచన చేయలేదు. కందిపప్పు అందరికీ ఇవ్వలేమంటూ రేషన్‌ దుకాణాల్లో అరకొర పంపిణీతో సరిపెట్టడమే ఈ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవాలి. కందిపప్పు కిలో 180 రూపాయల పైనే ఉంది. పల్లీ నూనె లీటరు 175 రూపాయల పైనే అమ్ముతున్నారు. ఇతర పప్పుల ధరలూ కిలో 130 రూపాయలకు పైనే ఉన్నాయి. పనుల్లేక, ఆదాయం రాక, సరుకులు కొనలేక పేదలు పండగ సంతోషానికి దూరమైన పరిస్థితి నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.