ETV Bharat / state

YSRCP Government Not Paying Salaries to Ambulance Employees: ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన జగన్.. ప్రతి నెలా జీతాల కోసం అంబులెన్స్ ఉద్యోగుల ఎదురుచూపు - అంబులెన్సు ఉద్యోగుల కష్టాలు

YSRCP Government Not Paying Salaries to Ambulance Employees: పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చిన రీతిలో హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక ముఖం చాటేయడం ముఖ్యమంత్రి జగన్‌కు అలవాటైపోయింది. ఆయన తప్పిన మాటల్లో 108, 104 ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు వారికి సకాలంలో జీతాలే ఇవ్వట్లేదు.

YSRCP_Government_Not_Paying_Salaries_to_Ambulance_Employees

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 7:03 AM IST

YSRCP Government Not Paying Salaries to Ambulance Employees: ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన జగన్.. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూస్తున్న అంబులెన్స్ ఉద్యోగులు..

YSRCP Government Not Paying Salaries to Ambulance Employees : 108 వాహనాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగ భద్రతకు ఢోకా లేకుండా చేస్తానని 2018 జనవరి 23న ప్రతిపక్ష నేతగా సూళ్లూరుపేటలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి తానే వస్తానని అందరూ ధైర్యంగా ఉండాలని బీరాలు పలికారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా చేస్తానంటూ 108 వాహనాల ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయ్యాక మాత్రం ముఖం చాటేశారు. అలవాటు ప్రకారం మడమ తిప్పేశారు. అవసరం తీరాక ఉద్యోగులకు కన్నీళ్లనే మిగిల్చారు. వారింకా ప్రైవేటు ఉద్యోగులుగా భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాడు జగన్ మాటలు నమ్మి ఎన్నో ఊహించుకున్నామని ఆయన అధికారాన్ని అనుభవించిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగ భద్రతే లేకుండా పోయిందని మనోవేదనతో తల్లడిల్లుతున్నారు.

CM Jagan Failed To Fulfill Promises to 108 Staff : గత ఒకటిన్నర దశాబ్దాలుగా 108 వాహనాల ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి వైఎస్సార్సీపీ పాలనలో నిర్ణీత తేదీకి జీతాలందిన పరిస్థితి లేదు. వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించడంలో 108 వాహనాల ఉద్యోగులదే కీలక పాత్ర. అలాంటి వారి జీవితాలు వైఎస్సార్సీపీ పాలనలో చీకటిమయమయ్యాయి. తిండికి తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లోకి జగన్ సర్కారు వారిని నెట్టేసింది. రెండు లేదా మూడు నెలల ఆలస్యంగా జీతాలిస్తోంది. అంతేకాదు.. ఏవేవో కారణాలతో వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తోంది. నిరంతరం అభద్రతా భావంతో బతుకీడ్చేలా పరిస్థితిని తీసుకొచ్చింది.

ఈ నెల అయినా సకాలంలో జీతాలు పడతాయా..! ఉద్యోగుల్లో టెన్షన్​

108 Ambulances Staff Situation in AP : ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ద్వారా 108 అంబులెన్సులు 7 వందల 31 నడుస్తున్నాయి. వీటిల్లో సుమారు 3 వేల 500 మంది పైలెట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్సులను అరబిందో సంస్థ నడుపుతోంది. దీని కోసం ప్రభుత్వం ఏటా 170 కోట్ల వరకు విడుదల చేస్తోంది. కానీ ప్రతి నెలా 108 ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు. 12 నెలల్లో కనీసం 10 నెలలపాటు సకాలంలో ఇవ్వటం లేదు.

Andhra Pradesh Govt for Delay in Salary to 108 Staff : ఒకవేళ ప్రభుత్వం నిధులివ్వకపోతే.. అంబులెన్స్ కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా కనీసం మూడు నెలల పాటు అరబిందో సంస్థ చూడాలి. 108 సేవలపై ఆర్భాటపు ప్రకటనలు చేసే ప్రభుత్వం.. నిధుల విడుదలలో జాప్యం చేస్తూనే ఉంది. దీని ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా కనిపిస్తోంది. ఆగస్టు నెల వేతనాలను ఇటీవలే చెల్లించారు. సెప్టెంబరు వేతనాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. అక్టోబరు వేతనాలు వచ్చే నెల అందే పరిస్థితి లేదు. ఇలా ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదు.

Salary Delayed For Employees in Andhra Pradesh: జీతాల కోసం ఎదురుచూపులు.. పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించని చిరునవ్వు..

Ambulances Run by Aurobindo Pharma Foundation : తల్లీబిడ్డలను ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇళ్లకు చేర్చే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం కింద సుమారు 5వందల 50 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా 5వందల వరకు వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. వీటి నిర్వహణ పూర్తిగా ఆ సంస్థ ద్వారానే జరుగుతోంది. ఒక్కో ట్రిప్పు కోసం ప్రభుత్వం 8 వందల 90 రూపాయలు చెల్లిస్తోంది. డ్రైవర్ల వేతనం ఒక్కొక్కరికి నెలకు 12 వేల రూపాయలు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు 9 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఒకవేళ సకాలంలో ప్రభుత్వం నిధులివ్వకపోయినా.. వేతనాలు చెల్లింపుల్లో అరబిందో సంస్థ జాప్యం చేయకూడదు. కానీ.. ప్రభుత్వం నుంచి నాలుగైదు నెలల వరకు చెల్లింపులు రావటం లేదని చెబుతూ ఆ సంస్థ యాజమాన్యం ఆలస్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No Salaries For Teachers : అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతూ ! మూడు నెలలుగా వేతనాలు అందక ఉపాధ్యాయుల వెతలు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.