ETV Bharat / state

వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ - రోడ్డున పడేశారు - CM Jagan comments on increase in social pensions

YSRCP Government Not Increasing Pension to Social Pensioners: దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు పెంచి వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. 3 వేల రూపాయలకు పింఛన్‌ సొమ్ము పెంచుతామని జగన్ ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పుడు ఇస్తున్న 2 వేల 750 రూపాయలు మందులకే సరిపోవడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YSRCP_Government_Not_Increasing_Pension_to_Social_Pensioners

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 7:26 AM IST

Updated : Nov 11, 2023, 1:40 PM IST

వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ - రోడ్డున పడేశారు

YSRCP Government Not Increasing Pension to Social Pensioners : ఆసరా పింఛన్లు 3 వేల రూపాయలకు పెంచుతామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఇప్పటికీ ఆ మాట నిలుపుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కళ్లు కాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. నెల మొత్తం దాని పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ పెరిగిన నిత్యావసరాల ధరలతో పోల్చితే వైసీపీ సర్కారు ఇచ్చే సాయం ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంట్లో అర్హులు ఎంత మంది ఉన్నా.. ఒక్కరికే ప్రభుత్వ సాయం అందుతోంది. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, మందులకు డబ్బులు సరిపోక బతుకు భారంగా గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Social Pensioners Problems in AP : దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు పెంచి వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పెరిగిన ధరలతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ సొమ్ములు ఏ మూలకు సరిపోవడం లేదు. 3 వేల రూపాయలకు పింఛన్‌ సొమ్ము పెంచుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాలేదు. దశల వారీ పెంపులో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 2 వేల 750 రూపాయలు మందులకే సరిపోవడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PRATHIDWANI: ప్రాణం తీసిన పిచ్చి, తలతిక్క నిబంధనలు

CM Jagan Comments on Increase Social Security Pension : ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగులపైనా ప్రభుత్వం కరుణ చూపడం లేదు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయింది. ఒంటరి మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోక.. కుటుంబపోషణ కష్టంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

" ఇంట్లో గడవడం కష్టంగా ఉంది : వికలాంగులమైన మేము చదువుకున్నాము. కానీ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉన్నాము. 3 వేల రూపాయలకు పెంచుతామని పింఛన్ ఇప్పటి వరకు పెంచలేదు. ఇంట్లో గడవడం కష్టంగా ఉంది. మాకు ఇవ్వవలసిన పింఛన్ పెంచాలని కోరుతున్నాము. అలాగే మాకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాము."- దివ్యాంగులు

వేల సంఖ్యలో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత

ప్రభుత్వం ఓ సారి ఆలోచించాలి : విజయవాడలో CPI ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక పెన్షనర్ల రాష్ట్ర సదస్సులో లబ్ధిదారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పధంతో ఆలోచించి దివ్యాంగులకు 7 వేల రూపాయలు.. వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను 6 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

"పింఛన్ పెంచాలి : ప్రస్తుతం ఉన్న రోజుల్లో నిత్యవసరాల ధరలు పెరిగిపోతున్నాయి. వృద్ధులను, వికలాంగులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. వారి బాధలు వర్ణణాతీతం.కావున పింఛన్ పెంచాలని కోరుతున్నాను."- బాబురావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నేత

Troubles of new pensioners : పెన్షన్.. టెన్షన్..! పెన్షన్​దారులకు షాకిస్తున్న విద్యుత్ సర్వీస్ నంబర్

Last Updated : Nov 11, 2023, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.