ETV Bharat / state

వైఎస్సార్​ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్యఅతిథిగా గవర్నర్​ - అచీవ్‌మెంట్‌ అవార్డు

YSR AWARDS 2022 : రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్​ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్‌, సీఎం జగన్‌ పాల్గొన్నారు.

YSR AWARDS
YSR AWARDS
author img

By

Published : Nov 1, 2022, 12:45 PM IST

YSR LIFE TIME ACHIEVEMENT AWARDS : రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అత్యున్నత్తమైన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్​ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్‌, సీఎం జగన్‌, వైఎస్​ విజయమ్మ పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించింది.

రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా వివిధ రంగాల్లో గొప్ప పనులు చేసిన వారికి అవార్డులు ఇస్తున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అవార్డులు అందించారు. సంస్కృతి సంప్రదాయాలు, వ్యవసాయం, మహిళా రక్షణ, వైద్యారోగ్య రంగం, పారిశ్రామికంగా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన వారికి వెనుకబాటు, అణచివేత మీద పోరాటం చేస్తున్న వారికి ఇస్తున్నామని జగన్​ తెలిపారు. అసామాన్య సేవలు అందించే వారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

సామాన్యుల నుంచి అసామాన్య వ్యక్తులను ఎంపిక చేసి.. రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అందిస్తున్నాం. 20 మందికి లైఫ్​టైమ్‌ అవార్డులు, 10 మందికి అచీవ్‌మెంట్‌ అవార్డులు అందిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధికి వివిధ రంగాల్లో గొప్ప పనులు చేసిన వారికి అవార్డులు ఇస్తున్నాం. అసామాన్య సేవలు అందించేవారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. -సీఎం జగన్​

విభాగాల వారిగా అవార్డులు..

వ్యవసాయం.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

1) ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ: సోడెం ముక్కయ్య, బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా.

2) కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ: ఎ.గోపాలకృష్ణ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.

3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌: జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా

4) అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ: కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా.

5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి: కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా

కళలు-సంస్కృతి విభాగం.. వైయస్సార్‌ జీవిత కాల సాఫల్య పురస్కారాలు

  • కళాతపస్వి కె.విశ్వనాథ్‌
  • ఆర్‌. నారాయణమూర్తి
  • సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ
  • పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌
  • దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరి చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగం కి.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

సాహిత్య సేవ.. జీవిత కాల సాఫల్య పురస్కారాలు

  • విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
  • ఎమెస్కో ప్రచురణాలయం
  • రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ

మహిళా సాధికారత–రక్షణ విభాగం.. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  • ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌
  • ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌
  • ఐదుగురు పోలీసుల (రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య, పి.శ్రీనివాసులు)కు.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు ఉమ్మడి

విద్యా రంగం నుంచి.. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  • మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థ
  • కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థ
  • మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు బి.వి.పట్టాభిరాం
  • నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డి కి.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌

మీడియా అవార్డులు..

  • సీనియర్‌ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు
  • సతీశ్‌ చందర్‌
  • మంగు రాజగోపాల్‌
  • ఎంఈవీ ప్రసాదరెడ్డి

వైద్య రంగం ..

  • డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
  • డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌ (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌)భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవాక్సిన్‌)
  • అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి
  • ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున గుళ్ళపల్లి నాగేశ్వరరావు
    వైఎస్సార్​ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్యఅతిథిగా గవర్నర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.