ETV Bharat / state

బైక్​పై విన్యాసాలు చేస్తూ ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి - బీఆర్‌టీఎస్‌ రోడ్డు

Young Boy Died : చేతిలో బైక్​ ఉంటే చాలు విన్యాసాలు చేసేందుకు రెడీ అవుతోంది యువత. సోషల్​ మీడియాలో చూసి ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉయ్యూరు పట్టణానికి చెందిన యువకుడు ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేసి ప్రమాదబారిన పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

young man died
ప్రాణాలు కోల్పోయిన యువకుడు
author img

By

Published : Nov 21, 2022, 11:00 PM IST

Young Boy Died in Bike Stunt: ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ అనే 18 ఏళ్ల యువకుడు విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి పమిడిముక్కల మండలం మంటాడ వద్ద బైక్‌పై విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌరి సాయికృష్ణ పరిస్థితి విషమించటంతో ప్రాణాలు కోల్పోయాడు. పేద కుటుంబం కావటంతో కుటుంబానికి సహాయ పడతాడని అతని తల్లిదండ్రులు భావించారు. చేతికి అందిన కుమారుడు ఇప్పుడు మరణించటంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే గతంలో ఇతను ఇలా విన్యాసాలు చేస్తున్నాడని తెలిసి పోలీసులు.. తల్లిదండ్రులు మందలించారని సమాచారం

నిత్యం ఇలా యువత ప్రమాదకర రీతిలో సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. విజయవాడ నగరం చుట్టూ పక్కల ప్రాంతాల్లో యువత ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారని సమాచారం. జనసంచారం తక్కువగా ఉన్న రహదారులను వీటి కోసం ఎంచుకుంటున్నారు. వివిధ రకాల వేడుకలు పుట్టినరోజు, ఫొటో సూట్​ పేర్లతో రద్దీ లేని బీఆర్‌టీఎస్‌ రోడ్డు, కనకదుర్గ వంతెన, హైటెన్షన్‌ రోడ్డు, బెంజి వంతెన, బ్యారేజి, తదితర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. జనసంచారం ఉండని అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్నారు. ఆ సమయంలో అయితే నిఘా పెద్దగా ఉండదనే ధీమానే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.