ETV Bharat / state

ఏప్రిల్ 5 వరకు నల్లబ్యాడ్జిలతో నిరసన.. ఆ తర్వాత మళ్లీ నిర్ణయం: బొప్పరాజు

AP ICASA Amaravati Today Updates: నేటి నుంచి వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీ వరకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని.. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నేడు రెవెన్యూ భవన్‌లో 26 జిల్లాలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు నుంచి ఉద్యమం మొదలుపెట్టాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. బుధవారం రోజున ప్రభుత్వంతో జరిపిన చర్చల కారణంగా ఏం చేయాలనే అంశంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. అనంతరం ఉద్యమ కొనసాగింపుపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

AP ICASA Amaravati
AP ICASA Amaravati
author img

By

Published : Mar 9, 2023, 5:54 PM IST

Updated : Mar 9, 2023, 7:47 PM IST

AP ICASA Amaravati Today Updates: నేటి నుంచి వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీ వరకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని.. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ఈరోజు రెవెన్యూ భవన్‌లో 26 జిల్లాలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నేటి నుంచి ఉద్యమం మొదలుపెట్టాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. బుధవారం రోజున ప్రభుత్వంతో జరిపిన చర్చల కారణంగా ఏం చేయాలనే అంశంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. అనంతరం ఉద్యమ కొనసాగింపుపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..''11వ పీఆర్సీ పే స్కేల్‌పై ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. పీఆర్సీ బకాయిల కింద మాకు రూ.వేల కోట్లు రావాలి. ఉద్యోగులు దాచుకున్న డబ్బును వాడుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా రూ.3 వేల కోట్లు చెల్లిస్తామని చెప్పారు. డీఏ, ఈఎల్‌ బకాయిలు రూ.2 వేల కోట్లు చెల్లిస్తామన్నారు. బకాయిలు ఎందరికి ఇచ్చారు?, ఎంతమందికి ఇవ్వాలనేది చెప్పాలి. మేం లేవనెత్తిన అనేక అంశాలను కమిటీ చర్చించలేదు. తెలంగాణలో పే స్కేల్‌ ఇచ్చారు.. ఇక్కడ మాత్రం మాకు ఇవ్వలేదు. సర్వీస్ రిజిస్టర్‌లో పీఆర్సీ ఎంట్రీ వేయడం చాలా విచిత్రం. మాకు ఎంతివ్వాలో లెక్క వేయకుండా చర్చలకు ఎందుకు పిలిచారు?'' అని ఆయన అన్నారు.

అనంతరం సీపీఎస్‌ ఉద్యోగుల రూ.2,600 కోట్ల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎఫ్‌ క్రెడిట్‌ అవుతుందా? లేదా? అనేది మెసేజ్‌లు రావడం లేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డబ్బు గురించి ప్రభుత్వం ఎటువంటి లెక్కలు చెప్పడం లేదని మండిపడ్డారు. దేశంలో సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల గురించి మంత్రుల కమిటీకి చెప్పామని పేర్కొన్నారు. ఓపీఎస్‌ తప్ప మరో పింఛను విధానానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇప్పటివరకూ ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఈ నెలాఖరు వరకు వేచి చూస్తామన్నారు.

ఏప్రిల్ 5 వరకు నల్లబ్యాడ్జిలతో నిరసన

ఇక, ఉద్యమ కార్యాచరణ విషయానికొస్తే.. చిన్న చిన్న మార్పులతో ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ఉద్యమానికి మద్దతు కోరుతూ.. 'ఉద్యోగులతో చేయి-చేయి కలుపుదాం' అనే కార్యక్రమంతో ఈ నెల 17వ తేదీన, 20వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగుల మద్దతు కోరతామన్నారు. రాయితీలకు సంబంధించి ప్రభుత్వం పలు హామీలు ఇవ్వడంతో లంచ్ ఆవర్‌లు, ధర్నాలను రద్దు చేశామన్నారు. మార్చి 21న, 27వ తారీఖుల్లో గతంలో ఇచ్చినట్టే కారుణ్య నియమకాలకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని బొప్పరాజు స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చకపోయినా, ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్లపై స్పందించకపోయినా సమావేశాన్ని నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామని జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 9, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.