ETV Bharat / state

విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి

Two people died due to electrocution: విజయవాడ సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

vja
విజయవాడ
author img

By

Published : Feb 2, 2023, 10:51 PM IST

Two people died due to electrocution: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్​తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 5వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట రమణ కేసు నమోదు చేసి.. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సీఐ వెంకట రమణ తెలిపిన వివరాల ప్రకారం..''విజయవాడలోని రామానగర్‌లో ఈ రోజు రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇప్పిలి సింహాచలం, అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ, ఆమె భర్త పేరు గోపీనాథ్‌లు నివాసముంటున్నారు. స్నానం చేసేందుకు సింహాచలం.. బకెట్‌లో వాటర్‌ నింపుకుని హీటర్‌ ఆన్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ తండ్రిని రక్షించడానికి ప్రయత్నించగా.. ఆమె కూడా షాక్‌కు గురయ్యింది. పక్కనే నివాసముంటున్న లక్కవరపు సీత హూటాహుటిన వారిని కాపాడేందుకు ప్రయత్నించి స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే సింహాచలం, మంగమ్మలు మృతి చెందారు'' అని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.