ETV Bharat / state

Lawers Meet CJ: సీజేని కలిసిన బార్ అసోసియేషన్‌ ప్రతినిధులు.. సీఐడీ నోటీసులపై వినతిపత్రం - High court chief justice news

Vijayawada lawyers met High Court CJ: ఏపీ సీఐడీ అధికారులు న్యాయవాదులకు నోటీసులివ్వడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్ మిశ్రాను.. బెజవాడ బార్ అసోషియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు కలిసి.. వినతిపత్రం అందించారు. సీజేఐకి సమర్పించిన ఆ వినతిపత్రంలో న్యాయవాదులు పలు కీలక విషయాలను వివరించారు.

Lawers Meet
Lawers Meet
author img

By

Published : Apr 21, 2023, 8:40 PM IST

Vijayawada lawyers met High Court CJ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులివ్వడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను నేడు బెజవాడ బార్ అసోషియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు కలిశారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే విధంగా నోటీసులిచ్చారంటూ.. వినతిపత్రం అందించారు. అనంతరం న్యాయవాదుల హక్కులను రక్షిస్తామని సీజే చెప్పినట్లు లాయర్లు మీడియాకు తెలిపారు. న్యాయవాదులకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకుంటే న్యాయస్థానంలో దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

సీఐడీ నోటీసులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేత

సీజేఐని కలిసిన బార్ అసోయేషన్‌.. న్యాయవాదులకు ఇటీవలే సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు బెజవాడ బార్‌ అసోయేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం న్యాయవాదుల విషయంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించింది. బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులైనా.. సుంకర రాజేంద్ర ప్రసాద్, బార్ కౌన్సిల్ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ కుమార్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని సీజేఐకి వివరించారు. ఈ ముగ్గురూ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారని, వారిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160, సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేస్తూ.. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరుకావాలని సమన్లు ​జారీ చేశారని పేర్కొన్నారు.

సీఐడీ ఇచ్చిన నోటీసుల ఉద్దేశ్యం అదే.. అనంతరం మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆడిటర్‌, బ్రహ్మయ్య అండ్‌ కో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కె.శ్రావణ్‌ కుమార్‌ను సీఐడీ అరెస్టు చేయడంపై విజయవాడలో ఏపీ ప్రొఫెషినల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండో తేదీన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన విషయాన్ని వినతిపత్రంలో పొందుపరిచినట్లు న్యాయవాదులు తెలిపారు. అందులో న్యాయవాదుల అభిప్రాయాలను వ్యక్తం చేశామని.. సీఐడీ ఇచ్చిన నోటీసుల ఉద్దేశ్యం.. న్యాయవాదులను బెదిరించడం, వారిని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నంగా ఉందని వారు వాపోయారు.

న్యాయవాదులకు రక్షణ కల్పిస్తాం.. ఈ నేపథ్యంలో ఇది భారత రాజ్యాంగం యొక్క ఆదేశాలకు, ప్రత్యేకించి వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 126కి విరుద్ధంగా ఉందని గుర్తు చేశారు. న్యాయవాదులు నేరంలో సాక్షులు కాదని తాము విశ్వసిస్తున్నామని.. సెక్షన్ 41(ఎ) సీఆర్‌పీసీ ప్రయోజనాలను నివారించడానికి ఐపీసీలోని అసంబద్ధమైన సెక్షన్లను ఉదహరిస్తూ.. సీఐడీ పోలీసుల అధికార దుర్వినియోగం అంశాలను తమ వినతిపత్రం ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లామని.. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆదేశాల విషయాన్ని ప్రస్తావించారు. బెజవాడ బార్‌ అసోయేషన్‌కు కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సీజేను కలిసి ఇతర సమస్యలను కూడా వివరించారు. న్యాయవాదులకు రక్షణ కల్పిస్తామని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చినట్లు న్యాయవాదుల బృందం పేర్కొంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.