ETV Bharat / state

Bhavani Island: భవానీ ఐలాండ్​పై అధికారుల నిర్లక్ష్యం..

author img

By

Published : Oct 24, 2022, 11:49 AM IST

Vijayawada Bhavani Island: భారీ వర్షాలకు వస్తున్న వరద ప్రవాహంతో విజయవాడ భవాని (ద్వీపం) ఐలాండ్‌.. కళ తప్పింది. ఇప్పటికే మూడు నెలలకు పైగా ఐలాండ్‌ను మూసేసిన అధికారులు.. నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో, బోటు విహారాన్ని కూడా రద్దు చేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. కార్తీకమాసంలో వన సమారాధనకు అనేక మంది ఇక్కడకు వస్తుంటారు. ఐతే వరద తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నిరాశే ఎదురుకానుంది.

Bhavani Island in AP
భవాని ఐలాండ్
కళ తప్పిన భవానీ ద్వీపం

Bhavani Island in AP: నిత్య కల్యాణం పచ్చ తోరణం లాగా పర్యాటకులతో కళకళలాడుతుండే భవానీ (ద్వీపం) ఐలాండ్‌ ప్రస్తుతం వెలవెలబోతోంది. పర్యాటకులతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఐలాండ్‌ ప్రస్తుతం పాలకులు పట్టించుకోక అనాధరణకు గురవుతోంది. ఆదాయం తెచ్చే భవానీ ఐలాండ్‌న్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. మూడు నెలల నుంచి భవానీ ఐలాండ్‌ మూసే ఉండటంతో పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కృష్ణనది అందాలను తిలకిస్తూ భవానీ ఐలాండ్‌ చేరుకోవడం అంటే పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. సాధారణ రోజుల్లో రోజుకు రెండు నుంచి మూడు వేల మంది భవానీ ఐలాండ్‌ సందర్శిస్తుంటారు. ఆదే వారంతపు రోజులైన శని, ఆది వారాల్లో అయితే 5 వేల మంది మంది వరకు ఈ ఐలాండ్‌న్ని సందర్శిస్తారు.

విజయవాడలో ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో విజయవాడ భవానీ ఐలాండ్‌ ప్రముఖమైనది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన వారు అలాగే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా భవానీ ఐలాండ్‌ సందర్శిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఇక్కడ గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. భవానీ ఐలాండ్‌లో సభలు, సమావేశాలు, శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నదికి వరదలు వస్తున్న నేపథ్యంలో నది విహారానికి అవకాశం లేకపోవడంతో పర్యాటకులు ఉసూరుమంటున్నారు.

మాములు రోజుల్లోనే భవానీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఇంకా రద్దీ పెరుగుతుంది. కార్తీక మాసంలో కుటుంబాలతో కలిసి ఇక్కడ వన భోజనాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ప్రస్తుతం పర్యాటకులు వస్తున్నార కానీ భవానీ ద్వీపాకి వెళ్లే అవకాశం లేదు. బెరం పార్క్ లోనే కొద్దిసేపు చెట్ల కింద కుర్చుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఎదైనా పండుగ వస్తుందంటే పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక రాయితీలను ప్రకటించి పర్యాటకులను ఆకర్షించే వారు ప్రస్తుతం భవానీ ద్వీపంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నదిలో బొట్లు తిరగకపోవడంతో టికెట్లు ఇచ్చే కౌంటర్ ను కూడా అధికారులు తెరడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.

భవానీ ఐలాండ్‌కు విచ్చేసే పర్యాటకుల కోసం అక్కడ విశ్రాంతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. కార్తీకమాసం వస్తున్న నేపథ్యంలో పర్యాటక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. నదికి వరద నీరు ఇలాగే కొనసాగితే నదిలో బొటు తిరిగే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. బొట్లు తిరగకపోతే కార్తీక మాసంలో వచ్చే అదాయాన్ని కూడా పర్యాటక శాఖ కొల్పోవలసి ఉంటుంది. ఇప్పటికే మూడు నెలల నుంచి భవానీ ఐలాండ్‌ మూసి ఉండటంతో పర్యాటక శాఖ లక్షల రుపాయల ఆదాయాన్ని కోల్పోయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.