ETV Bharat / state

'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వ జాప్యం' - APUTF

Teachers Promotions: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని చెప్పిన ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బదిలీలు చేపట్టటం లేదని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్​ల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

APUTF
యూటీఎఫ్​
author img

By

Published : Nov 21, 2022, 7:35 PM IST

Teachers Transfers, Promotions: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బదిలీలు పూర్తి చేయలేదని యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరులు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం సీపీఎస్​ రద్దు, బకాయిలు, బదిలీలపై జాప్యం చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా.. పీఆర్సీ సమావేశంలో ప్రభుత్వంతో విభేదించి సమావేశం నుంచి బయటకు వచ్చామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు నిరసనగా.. మంగళవారం ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్​ల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 30వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటున్న నేతలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.