- చంద్రబాబు కందుకూరు పర్యటనలో అపశ్రుతి.. డ్రైనేజీ కాలువలో పడిన కార్యకర్తలు
కందుకూరులో చంద్రబాబు పర్యటనలో అపశ్రుతిభారీగా తరలివచ్చిన కార్యకర్తలతో స్వల్ప తోపులాటఅదుపుతప్పి డ్రైనేజీ కాలువలో పడిన పలువురు కార్యకర్తలు 10మంది కార్యకర్తలు ఆసుపత్రికి తరలింపు .
- లోకేష్ పాదయాత్రకు "యువగళం" పేరు ఫిక్స్.. ప్రోమో అదుర్స్
NARA LOKESH PADAYATRA NAME FINALIZED : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 27న కుప్పం నుంచి ఆయన మహా పాదయాత్రగా జనక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. లోకేష్ మహా పాదయాత్రకు "యువగళం" పేరును పార్టీ ఖరారు చేసింది. NTR భవన్లో.. యువగళం జెండాను పలువురు నాయకులు ఆవిష్కరించారు.
- నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడుగుతాం: ఆనం
MLA ANAM SESATIONAL COMMENTS : రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఏర్పాటు చేసిన వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని.. ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు.
- పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనుకోవడం సరికాదు: పవన్
Jana Sena Pawan Kalyan is letter to CM Jagan: రాష్ట్రంలో సామాజిక పింఛన్లు తొలిగించేందుకు.. వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు సమంజసంగా లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పింఛన్లు తొలిగింపుపై పునరాలోచించాలని పవన్ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
- పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి భార్య అయితే ఓకేనట!
జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించారు. ఏం చెప్పారంటే?
- రష్యా నేతల మృతికి కారణాలు అవే.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు
ఒడిశాలో అనుమానాస్పదంగా మృతి చెందిన రష్యా టూరిస్ట్‌ల శవపరీక్షల ఫలితాలు వచ్చాయి. ఒకరు గుండెపోటుతో మరొకరు అంతర్గత గాయాల కారణంగా చనిపోయినట్లు శవపరీక్షల ద్వారా తెలిసింది.
- 'ఆ 40 రోజులు కీలకం'.. కరోనాపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. మాస్కులపై క్లారిటీ
జనవరి నెలలో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది! కరోనా ఉద్ధృతి విషయంలో వచ్చే 40 రోజులు కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కేంద్రం తెలిపింది. అయితే, మాస్కులు తప్పనిసరి కాదని పేర్కొంది.
- ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు.. ఇప్పుడు అక్రమాలకు అడ్డా
Illegal Activities in Gudivada: ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పట్టణమది. ఇప్పుడు దౌర్జన్యాలు, దందాలు, అక్రమాలు, కబ్జాలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి మారలేదు. కానీ ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
- ఈ ఏడాది అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లు వీరే కోహ్లీ ఏ స్థానంలో ఉన్నాడంటే?
2022 సంవత్సరం ముగియనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా టీమ్ఇండియా తమ షెడ్యూల్‌తో బిజీ బిజీగా గడిపింది. ఐపీఎల్ సహా మూడు ఫార్మాట్లతో నిలకడగా రాణిస్తూనే ఏడాదిని పూర్తిచేసింది. ఈ క్రమంలోనే కొందరు ప్లేయర్స్ తమ వ్యక్తిగత ప్రతిభను చాటుకోగా.. మరికొందరూ వైఫల్యాలను చవిచూసారు. అయితే ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో చూద్దాం.
- ప్రభాస్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. రెండు భాగాలుగా 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్
ప్రభాస్ గెస్ట్‌గా రానున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఆ సంగతులు మీకోసం...
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షోకు ఎందరో రాజకీయ నాయకులు, సెలబ్రటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఒక్కొ ఎపిసోడ్ ఒక్కో బ్లాక్‌బస్టర్‌గా ఉంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. ఇక అంతే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ఒకటా, రెండా.. ట్రైలర్, టీజర్ అంటూ వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్కు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు.