ETV Bharat / state

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS
author img

By

Published : Dec 24, 2022, 5:00 PM IST

Updated : Dec 24, 2022, 6:09 PM IST

వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు
CBN MET FARMERS : టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ.. రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల పంటను మొబైల్‌ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామన్నారు. రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామని తెలిపారు.

రాష్ట్రంలోని ఐటీ కంపెనీలను తరిమేయాలని చూస్తున్నారు: ఎంపీ జీవీఎల్‌
BJP MP GVL: ఐటీ రంగంలో ఉన్న కంపెనీలను తరిమేయాలనే ఆలోచన తప్ప.. కొత్త కంపెనీలను తీసుకురావాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. సీఎం తన పేరు జగన్‌,.. తాను ఇక్కడే ఉంటానంటూ కొత్త డైలాగ్‌ కొట్టారనీ.. అమరావతి విషయంలోనూ ఇదే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఇక్కడే ఉంటుందని అన్నారని... ఆ మాటకు కట్టబడి లేరని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.

జగన్ వెంట అతని కుటుంబమే లేదు: ప్రత్తిపాటి పుల్లారావు
Prathipati Pulla Rao Comments: ఒకే రాష్ట్రం..ఒకే కుటుంబం అంటున్న జగన్ వెంట అతని కుటుంబమే లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనం మాచర్ల అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాచర్లలో బడుగులను చంపించింది వైసీపీ నేతలు కాదా అని మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు.. కొద్ది నిమిషాల్లోనే
Tirumala Srivari Tickets Released online: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్​లైన్​లో టికెట్లు విడుదల చేసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లు.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి.

కవలలతో భారత్​కు ఈశా.. 300 కిలోల బంగారం దానం చేయనున్న అంబానీ!
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. తన చిన్నారులతో సహా ముంబయికి చేరుకున్నారు. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ముకేశ్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

'కృష్ణుడి జన్మస్థలిలో మసీదు నిర్మాణం'.. మథుర కోర్టు కీలక తీర్పు
Shahi Idgah Mosque Case : శ్రీకృష్ణుడి జన్మలంలో మసీదు నిర్మించారన్న పిటిషన్‌పై ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర సివిల్ కోర్టు తీర్పును వెలువరించింది. నిజానిజాలు వెలికితీసే బాధ్యతను పురావస్తుశాఖకు అప్పగించింది.

నర్సింగ్​ హోమ్​లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం
ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యాలో జరిగిందీ ఘటన.

రచ్చకెక్కిన కొనుగోళ్లు.. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన విలీనాలివే..
Top Mergers And Acquisitions : ఈ ఏడాదే ఎయిరిండియా టాటాల చేతికెళ్లింది. ప్రముఖ టీవీ ఛానెల్‌ ఎన్డీటీవీలో అదానీ ప్రధాన వాటాదారుగా నిలిచారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్​ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అలా ఈ ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచిన కొనుగోళ్లు, విలీనాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

IND Vs Ban: మూడో రోజు ఆట పూర్తి.. టీమ్‌ఇండియా 4 వికెట్లు డౌన్‌
భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలుత ఓవర్‌నైట్‌ స్కోరు 7/0తో ఆట ప్రారంభించిన బంగ్లా 231 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 145 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది.

Veerasimha reddy: ఇద్దరు భామలతో బాలయ్య ఊర మాస్​ స్టెప్స్​.. అస్సలు తగ్గట్లేదుగా!
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో మరో సాంగ్​ రిలీజై ఆకట్టుకుంటోంది. ఇందుల ఇద్దరు భామలతో కలిసి బాలయ్య వేసిన చిందులు మాములుగా లేవు.

Last Updated : Dec 24, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.