Tomato and Onion Prices Increasing in Vijayawada : ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలు (Rice Prices) ఈ మధ్యకాలంలో పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో డబుల్ సెంచురీకి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలోనే ఉల్లి, టమాట ధరలు సామాన్యుడికి కంటినీరు పెట్టిస్తున్నాయి. నెలనెల విద్యుత్ బాదుడు, ఇంటి అద్దె, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులతో మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణే కష్టమవుతున్న తరుణంలో నిత్యవసరాలు, కూరగాయల ధరలు ఎటువంటి నియంత్రణ లేకుండా పెరిగితే ఎలా బతికాలని సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పంట పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం దళారులను ప్రోత్సహిస్తోందని మండిపడుతున్నారు.
Tomato Prices Decreased : ప్రస్తుతం ఉల్లి, టమాటాల ధరలు పెరుగుదలకు (Onion, Tomato Rate Hike) ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతో పాటు, దళారులు కృత్రిమంగా సృష్టించిన పరిస్థితులు కారణమని సామాన్యులు విమర్శిస్తున్నారు. ఉన్నట్టుండి ధరలు రెట్టింపు అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం డబుల్ సెంచురీ (Double Century)కి చేరువైన టమాట ధర తగ్గుముఖం పట్టిందని సంతోషించిన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి పెరిగింది. వారం క్రితం కిలో టమాటా ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటే ప్రస్తుతం విజయవాడ రైతు బాజారులో 32 రూపాయలకు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో 60 రూపాయల వరకు ఉంది.
Onion Price Hike: ఉల్లి ధర డబుల్.. మొన్నటి దాకా వందకు మూడు కిలోలు.. ఇప్పుడు కిలో రూ.60పైనే..!
Onions are Scarcity : దేశంలో ఉల్లిపాయలు కొరత ఏర్పడే అవకాశం ఉందని కొన్ని నెలల నుంచి నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఉల్లి పంట కొరతను అంచనా వేసి ప్రణాళికలు రచించి రైతులను ఉల్లి పంటవైపు ప్రోత్సహంచడం, గిడ్డంకుల్లో భద్రపరచడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని సామాన్యులు ఆరోపిస్తున్నారు.
Increasing Vegetables Prices : ప్రస్తుతం కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలు (Food Grains Prices) పెరిగే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక రచించాలి. వాతావరణ మార్పులతో ప్రస్తుతం అనేక అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. తమకు వచ్చే ఆదాయం పెరగటం లేదని.. ఖర్చులు మాత్రం రెట్టింపు అయ్యావని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వచ్చే జీతాలు అవసరాలకు సరిపోక అప్పులపాలవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడమే పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద సవాలుగా మారిపోయిందని పేద, మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Onion Price Hike : ఉల్లి ధరకు రెక్కలు.. తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందంటే?
Onion Rate Hike Due to Rainfall Conditions in AP : ఉల్లిపాయలు, టమాటాల ధరలు మరో 15 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతు బజారు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పంట మార్కెట్లోకి వస్తోందని, మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలోనూ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఉల్లి, టమాట పంట రైతుల చేతుకి వస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఉల్లి, టమాట పంట విస్తీర్ణం తగ్గిందని, వర్షాభావ పరిస్థితులు వీటి ధరల పెరుగుదలకు ఓ కారణమని రైతు బజారు అధికారులు చెబుతున్నారు.
Increased prices: ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు