ETV Bharat / state

మనకు తెలిసిన శివరూపం లింగం ఒకటే.. కానీ తెలియని రూపాలు ఎన్నో - Forms of status

Lord Shiva In Various faces: శక్తిమంతుడైన పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా. మరే ఇతర రూపాలు లేవా.. అంటే యావత్ విశ్వమంతా తానే నిండిన స్వామికి అవతారాలెన్నో.. రూపాలు మరెన్నో ఉన్నాయని శైవాగమాలు స్పష్టంచేస్తున్నాయి. చాలా సందర్భాల్లో శివుడు అవతరించిన అవతారాలు దాదాపు 175 వరకు ఉన్నాయని చెబుతున్నాయి. వీటిలో మనం అర్చించి, అభిషేకం చేసేది ఒక లింగరూపానికి మాత్రమే. దేవదేవుడు అవతరించిన సందర్భం, సాక్షాత్కరించిన రూపం ఆధారంగా శివుడి రూపాల్ని విభజించారు. వీటి గురించి శైవాగమ ధ్యాన రత్నావళి అనే గ్రంథంలో జ్ఞానపాదం, యోగపాదం అనే విభాగాల్లో ఉంది.

Parameshwar
పరమేశ్వరుడు
author img

By

Published : Feb 16, 2023, 3:57 PM IST

Updated : Feb 16, 2023, 4:21 PM IST

Lord Shiva In Various faces: పురాణాల్లో చాలా సందర్బాల్లో పరమేశ్వరుడు అవతరించిన రూపాలు సుమారు 175 వరకు ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. వీటిలో మనం అర్చించి, అభిషేకం చేసేది ఒక లింగరూపానికి మాత్రమే. వీటి గురించి శైవాగమ ధ్యాన రత్నావళి అనే గ్రంథంలోని జ్ఞానపాదం, యోగపాదం అనే విభాగాల్లో స్వామి అవతరించిన సందర్భం, సాక్షాత్కరించిన రూపం ఆధారంగా శివుడి రూపాల్ని విభజించనట్లు ఉంది.

సృష్టి రూపాలు : ఈ సృష్టి వ్యవహారంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే.. బ్రహ్మకి సృష్టించే శక్తిని ఇచ్చింది శివుడేనని ఆగమాలలో పొందుపరచి ఉంది. కొన్ని సందర్భాల్లో తనలోనే సృష్టి ఉందని ఈ లక్షణాన్ని ప్రకటిస్తూ మల్లిఖార్జునుడు ధరించిన రూపాలివి. విష్ణువు కూడా నిరంతరం పరమేశ్వరుడినే ధ్యానిస్తాడు.

అనుగ్రహ రూపాలు : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది ఈ రూపం తెలియజేస్తుంది. పరమేశ్వరుడు నిర్వహించే పంచకృత్యాలలో ఇది చాలా తేలికైన విషయం. ఏదైన పనికి విఘ్నం కలిగించాలన్నా, ఆ విఘ్నాన్ని తొలగించాలన్నా అది ఆ లింగమూర్తి ఆధీనంలో ఉంటుంది. విఘ్న కర్త, హర్త కూడా శివుడే.. ఈ లక్షణాన్ని తెలియజేస్తూ శంకరుడు ధరించిన అవతారాలివి..

తిరోధాన రూపాలు : ఈ సృష్టిలోని చైతన్యాన్ని కొద్దికొద్దిగా వెనక్కు తీసుకోవటమే తిరోధానం అంటారు. అంటే తనచే ఆవిర్భవించిన విశ్వం, అందులోని శక్తిని శివుడు నెమ్మదిగా తనలో లయం చేసుకుంటాడు.

స్థితి రూపాలు : చంద్రశేఖరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి జీవికి అవసరమైన శక్తి అందుతుంది. ఈ లక్షణాన్ని చెబుతూ స్వామివారు అవతరించిన రూపాలన్నీ స్థితిరూపాలుగా చెబుతారు..

సంహార రూపాలు : బోళాశంకరుడిగా అందరికీ వరాలు ఇవ్వటమే కాదు... అవసరమైతే ప్రాణాలు హరిస్తాడు కూడా. ఆయా సందర్భాల్లో లోకేశ్వరుడు ధరించిన రూపాలే సంహార రూపాలు.

పురాణాల ప్రకారం ఆ మహేశ్వరుడికి ఉన్న రూపాలు:

  • చండేశానుగ్రహమూర్తి, విఘ్నప్రసాదమూర్తి, చక్రప్రదానమూర్తి, వృషారూఢమూర్తి, దక్షిణామూర్తి
  • లింగమూర్తి, లింగోద్భవమూర్తి, కల్యాణ సుందరమూర్తి, చంద్రశేఖరమూర్తి, గంగాధరమూర్తి
  • జలంధరహరమూర్తి, త్రిపురసంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, గజసంహారమూర్తి, కాలసంహారమూర్తి
  • సోమాస్కందమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, హరిహరమూర్తి, కిరాతమూర్తి, నటరాజమూర్తి
  • భిక్షాటనమూర్తి, వీరభద్రమూర్తి, కంకాలధారణమూర్తి, శరభమూర్తి, ఏకపాదమూర్తి

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2023, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.