ETV Bharat / state

ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు...

author img

By

Published : Apr 11, 2023, 5:01 PM IST

Temperatures: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ధాటికి ప్రజలు ఇంటి నుంచి బయటికు రావాలంటే హడలిపోతున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్​ను దాటి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Temperatures
Temperatures

Temperature due to climate change: వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్​ను దాటి నమోదు అవుతున్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలమేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ చెబుతోంది.

ఏపీలో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దరిదాపుల్లోనే నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు భారత వాతావరణ విభాగం చెబుతోంది. మరో 5 రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలను మించి ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.

గరిష్టంగా విజయనగం జిల్లా గుర్లలో 41.83 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది, నంద్యాలలోని ఆత్మకూరులో 41.7, ఏలూరు జిల్లా పూళ్ల వద్ద 41.11, బాపట్లలో 41.6, ప్రకాశం జిల్లా గోస్పాడులో 41.8, జంగారెడ్డి గూడెంలో 41.65, అనకాపల్లిలో 41.62, కురిచేడులో 41.5, నెల్లూరులో 41.4, నంద్యాలలో 41.2, సత్యసాయి జిల్లాలో 41.29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. విజయవాడలో 38.1, తిరుపతిలో 40.7, కడపలో 38.3, ఒంగోలులో 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

విశాఖపట్నంలో 39.3 డిగ్రీలు, శ్రీకాకుళంలో 37.7, కాకినాడలో 37.2, కోనసీమ జిల్లా అల్లవరంలో 34.9 డిగ్రీలు, బాపట్లలో 33.7 డిగ్రీలు, కర్నూలులో 38.74, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 38.12, పల్నాడులోని బొల్లాపల్లిలో 41.08 డిగ్రీలు, అనంతపురంలో 41.03, పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 40.93, కడపలో 40.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో 40.61 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 40.6 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యింది. అల్లూరి జిల్లా కూనవరంలో 40.31 డిగ్రీలు, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 40.01 డిగ్రీలు, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 39.7 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 39.24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగాను గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదు అవువుతుందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. 2-4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉండోచ్చని సూచించింది. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఏప్రిల్ 15 తేదీ వరకూ వడగాడ్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.