TDP new program 'Guarantee to Future': తెలుగుదేశం పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 10వ తేదీన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం సుమారు 150 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రేపు అన్ని నియోజకవర్గాల పరిశీలకులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి..? వంటి అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరీ ఇంతకీ ఆ కొత్త కార్యక్రమం ఏంటీ..? ఆ కార్యక్రమానికి ఏ పేరు పెట్టారు..? అనే విషయాలను తెలుసుకుందామా..
జూన్ 10న కొత్త కార్యక్రమానికి శ్రీకారం.. 'భవిష్యత్‌కు గ్యారెంటీ' పేరుతో తెలుగుదేశం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం 150 రోజుల పాటు 'భవిష్యత్‌కు గ్యారెంటీ' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు అన్ని నియోజకవర్గాల పరిశీలకులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సమావేశంలో ఈ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
TDP Manifesto: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. వివరాలివే..
'భవిష్యత్తుకు గ్యారెంటీ'పై రేపు సమావేశం.. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకులు జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో చంద్రబాబు నాయుడు 'భవిష్యత్తుకు గ్యారెంటీ' అంటూ మీనీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పేరుతోనే ('భవిష్యత్తుకు గ్యారెంటీ') ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వెళ్లనున్నారు. గతకొన్ని నెలలక్రితం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన 'బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో త్వరలోనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Maha Shakthi Scheme: ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ కీలక ముందడుగు.. మహిళా సాధికారతకు "మహాశక్తి"
టీడీపీ తొలి అంచె మేనిఫెస్టో విడుదల.. ఆంధ్రప్రదేశ్‌లో..2024లో జరగబోయే ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు ఉండగానే తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక పథకాలతో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో తొలి అంచె మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫెస్టోలో.. మహిళలకు, నిరుద్యోగ యువతకు, రైతులతో పాటు, పార్టీకి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాకుండా, మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్ అనే ఆరు కార్యక్రమాల్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం వేమగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రకటించారు.
ఆరు కార్యక్రమాలపై చంద్రబాబు అవగాహన.. అనంతరం ఆ ఆరు కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమలు చేయనున్నారు..?, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల కోసం ఏయే పథకాలను ప్రవేశపెట్టనున్నారు.. అనే విషయాలపై చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా వ్యాఖ్యానించారు. తాజాగా ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతోనే మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంపై రేపు పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
Yanamala on YCP: 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు': యనమల