TDP politburo members fired on CM Jagan: దళితుల ఓట్లతో జగన్ సీఎం అయి, మొదట నయవంచన చేసింది దళితులనేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం టీడీపీ 27 పథకాలను తీసుకువస్తే, జగన్ సీఎం అవ్వగానే వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. నవరత్నాలు ఇస్తే దళితులకు న్యాయం జరుగుతుందా? అని నిలదీశారు. బడ్జెట్లో దళితులకు 7వేల కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు కానీ ఒక రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులు అంతా సీఎం జగన్‌ని కనిపిస్తే నిలదీయాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో చివాట్లు పడుతున్నా.. సీఎం జగన్‌కి సిగ్గులేదని ఆక్షేపించారు. కోటిమంది దళితులు, 40 లక్షల మంది గిరిజనుల హక్కులను జగన్ కాలరాశాడని దుయ్యబట్టారు. ఐదుగురికి మంత్రి పదవులు, ముగ్గురికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తే దళితులకు న్యాయం జరిగినట్లేనా అని నిలదీశారు. జగన్ కేబినెట్లో ఉన్న దళిత మంత్రులకు పదవులు ఉన్నాయి, కానీ పది పైసా నిధులు కూడా లేవని ఆక్షేపించారు.
రాష్ట్రంలో సీఎం బియ్యం మాఫియా నడిపిస్తున్నాడు : జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే రాష్ట్రంలో బియ్యం మాఫియా నడిపిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి కలిసి పేదల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తూ, జగన్ రాజప్రాసాదానికి ఎప్పటికప్పుడు లెక్క ముట్టచెబుతున్నారని మండిపడ్డారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా సాగుతున్న జగన్ రెడ్డి బియ్యం దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. పేదల బియ్యాన్ని తనబొక్కసంలో వేసుకున్న జగన్ సర్కారుపై కేంద్రం కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: