TDP Leaders Fires on YSRCP Government : పట్టుదల, స్వయం కృషితో రామోజీరావు ఎదిగారని.. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆరు దశాబ్దాలుగా మచ్చలేని చరిత్ర కలిగిన మార్గదర్శిని రాజకీయ కక్షతో వేధించడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పుట్టక ముందు నుంచే ఉన్న ఈ సంస్థ.. ఎలాంటి మచ్చ లేకుండా ముందుకు సాగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాలనా తీరుపై "ఈనాడు, ఈటీవీ భారత్" వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే.. మార్గదర్శిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర చట్టాలకు కట్టుబడే మార్గదర్శి పనిచేస్తోందని ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ చెబుతోందని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజం కాదన్నారు. రామోజీరావు అనే అతిపెద్ద పర్వతంపై రాష్ట్ర ప్రభుత్వం రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తోందని.. ఆ రాళ్లే తిరిగివచ్చి వారి ముఖంపై పడతాయని ఊహించడం లేదన్నారు. జరగబోయేది అదేనని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
వైసీపీకి పతనం మొదలైంది : అధికార వైసీపీ ప్రభుత్వానికి పతనం మొదలైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళ వెంకటరావు అన్నారు. రాజాం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కనుమరుగైందన్నారు.
యువతను మోసం చేశారు : నిరుద్యోగ సమస్య అధికార వైసీపీ హయంలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వైసీపీ నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని.. అంతేకాకుండా రాష్ట్రంలోని వనరులన్నీ నిరుపయోగం అవుతున్నాయని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే : మార్గదర్శిపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు వెంటనే విరమించుకోవాలని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజ గదీశ్వరరావు డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్యలో ఆడిన డ్రామాలో వాస్తవాలు బయటకు వచ్చాయని, కోడి కత్తి నాటకం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే నీతికి, నిజాయితీకి నిలువుటద్దమైన రామోజీరావు, ఆయన సంస్థలపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారని, సీఎం జగన్ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు బెదిరే రకం కాదన్నారు. మార్గదర్శిపై దిల్లీ స్థాయిలో బురద జల్లాలని ప్రభుత్వం చూసినా లక్షలాది మంది చందాదారుల్లో ఒక్కరూ లెక్క చేయలేదన్నారు. రామోజీరావుపై ప్రజలకు ఉన్న నమ్మకానికి అదే నిదర్శనమన్నారు.
ఇవీ చదవండి :
- Illegal sand mining: పెన్నా నది గర్భాన్ని తవ్వేస్తున్న అధికార పార్టీ నేతలు.. అడ్డుస్తే, లారీలతో తొక్కేస్తామంటూ బెదిరింపులు
- student died: గర్భస్రావమై విద్యార్థిని మృతి.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
- Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం విద్యార్థులు పొరుగురాష్ట్రాల బాట