ETV Bharat / state

TDP Leaders Agitation Against the Removal of Idols: విగ్రహాలు తొలగించారు.. మరుగుదొడ్ల పక్కన పడేశారు..

TDP Leaders Agitation Against the Removal of Idols: నందిగామలో జాతీయ నాయకుల విగ్రహాలను అడ్డగోలుగా తొలగించడంపై తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రోడ్ల విస్తరణ సాకుతో జాతి కోసం పాటుపడిన మహనీయులను ఘోరంగా అవమానించారని... తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. తొలగించిన 14 విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్లు పక్కన పడేయడంపై మరింత దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. విగ్రహాల తొలగింపును ఖండిస్తూ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ధర్నా చేశారు.

TDP Leaders Have Taken Up Agitation Against The Removal Of Idols

author img

By

Published : Aug 17, 2023, 9:21 PM IST

TDP Leaders Agitation Against the Removal of Idols: విగ్రహాలు తొలగించారు.. మరుగుదొడ్ల పక్కన పడేశారు..

TDP Leaders Agitation Against the Removal of Idols in Nandigama: హై కోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను తొలగించారు. ఆ విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో మరుగుదొడ్ల పక్కన పెట్టడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi Idol), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగజీవన్ రావ్, ఎన్టీఆర్ తో పాటు 14 మంది జాతీయ రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు అర్ధరాత్రి తొలగించారు. తొలగించిన విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్ పక్కన పెట్టారు. యంత్రాలతో జాతీయ నేతల విగ్రహాలు తొలగించడంతో అవి దెబ్బతిన్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కాళ్లు విరిగిపోయాయి, పలుచోట్ల పగిలిపోయింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం రెండుగా చీలిపోయింది. విగ్రహం రెండుగా చీలిపోవడంతో ఆకారం కోల్పోయింది. అదేవిధంగా పలువురు జాతీయ నేతలు విగ్రహాలు కూడా అక్కడక్కడ స్వల్పంగా దెబ్బతిన్నాయి. విగ్రహాల తొలగింపునకు భారీ క్రేన్లు ఇతర యంత్రాలు ఉపయోగించడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది .

Police Force in Gandhi Centre: గాంధీ సెంటర్లో భారీ బందోబస్తు: గత రాత్రి విగ్రహలను పురపాలక(Municipal Corporation) అధికారులు భారీ బందోబస్తు మధ్యన తొలగించారు. తొలగించిన విగ్రహలను పురపాలక సంఘం కార్యాలయానికి తరలించారు. ఈ తొలగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం అర్దరాత్రి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపద్యంలో గురువారం ఉదయం నుంచి గాంధీ సెంటర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోడ్ల కూడలికి అన్ని వైపుల బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి సామాన్య ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఆ ప్రాంతంలోని షాపులు తెరుచుకోలేదు. గాంధీ సెంటరును పోలీసులు అష్ట దిగ్బంధం చేయడంతో ఉదయానే పాలు, పెరుగు తెచ్చుకునేందుకు ప్రజలు స్వల్ప ఇబ్బందులు పడ్డారు.

TDP Leader Tangirala Soumya Fire on Officers: ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు: రాష్ట్ర, జాతీయ నాయకుల విగ్రహాలు తొలగింపుపై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala Soumya) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆమె తన ఇంటి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే సౌమ్య, నాయకులు రాస్తారోకో చేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి విగ్రహం( Rajasekhar Reddy Statue ) తొలగించకుండా మిగిలిన జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జాతీయ నాయకులు విగ్రహాలను తొలగించి పురపాలక సంఘ కార్యాలయంలో టాయిలెట్లు పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగజీవన్ రావ్, ఎన్టీఆర్ వంటి మహానుభావుల... విగ్రహాలు మరుగుదొడ్ల పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన అధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.