ETV Bharat / state

చంద్రబాబు పేరు చెబితే.. వైసీపీ వెన్నులో వణుకు: బొండా ఉమా - టీడీపీ అధికారప్రతినిధి బోండా ఉమా

TDP leader Bonda Uma Vangalapudi Anita: చంద్రబాబు పేరు చెబితే వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీఅధికారప్రతినిధి బోండా ఉమ ఎద్దెవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాట.. మంతి అనే కార్యక్రమంలో బోండా ఉమా, వంగలపూడి అనిత పాల్గొన్నారు. పులివెందుల పక్క ఊర్లో చంద్రబాబుకు వచ్చిన ప్రజాదరణ చూసి.. జగన్ పెంపుడు కుక్కలన్నీ ఒకేసారి మొరుగుతున్నాయని మండిపడ్డారు.

Bonda Uma Vangalapudi Anita
Bonda Uma Vangalapudi Anita
author img

By

Published : Nov 20, 2022, 4:58 PM IST

Mata Manti program in Vijayawada: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని భాను నగర్​లో రచ్చబండ తరహాలో టీడీపీ వినూత్నంగా.. మాట ..మంతి అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమా, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. స్థానిక మహిళల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పేరు చెబితే వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమ ధ్వజమెత్తారు. పులివెందుల పక్క ఊర్లో చంద్రబాబుకు వచ్చిన ప్రజాదరణ చూసి.. జగన్ బ్యాచ్​ అంతా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

విజయవాడలో మాట.. మంతి అనే కార్యక్రమం

మొన్నటి వరకూ మంత్రులకే అపాయింట్​మెంట్​లు ఇవ్వని జగన్‌.‌.. ఇవాళ కార్యకర్తలతో ముఖాముఖీ‌ ఇస్తారంటా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత ఈ పేటీఎం గ్యాంగ్ ఎవరూ కనపడరని బొండా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లో 2వేల నోట్లు అన్నీ జగన్ ఖజానాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. మోదీ డ్వాక్రా మహిళలను పొగిడితే.. జగన్​కు ఒణుకు పుట్టిందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. డ్వాక్రా అనేది చంద్రబాబు మానస పుత్రిక అని అనిత స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలనే జగన్ సమావేశాలకు, చివరకు మోదీ సమావేశానికి సైతం తీసుకెళ్ళారని మండిపడ్డారు. డ్వాక్రా వ్యవస్ధను సమూలంగా నాశనం చేసిన ఘనత జగన్​కే దక్కిందన్నారు. సీఎంకి పరదాలు, పోలీసులు లేకుండా వచ్చే దమ్ముందా అంటూ విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.