Bonda Uma on YS Viveka Murder Case: హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడని విధంగా వివేకా హత్యకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచించారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ నేరగాళ్లకు సైతం ఊహకందని విధంగా వివేకా హత్యకు జగన్మోహన్ రెడ్డి దర్శకత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసి సంతాప సభలు పెట్టిన నటనా ప్రావీణ్యం ఇంకెవరికీ సాధ్యం కాదని విమర్శించారు. వివేకా హత్య పాత్రదారుడు అవినాష్ రెడ్డి వెనుక ఉన్న అసలు సూత్రదారుడు జగన్ రెడ్డేనని స్పష్టం చేశారు. హత్య కేసు నిందితులు ఆరోజు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాడేపల్లి ప్యాలెస్ ఏం సమాధానం చెప్తారని బొండా ఉమ ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దొరికిపోయిన దొంగలు, ఇక తప్పించుకోలేరని తెలిపారు. వివేకానంద రెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చిందో ఇటీవలే కొడాలి నాని చెప్పారని... దానిని నిశితంగా పరిశీలించి సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని వెల్లడించారు. వివేకా హత్య తర్వాత చోటు చేసుకున్న వివిధ పరిణామాల వీడియోలను బొండా ఉమా మీడియా సమావేశంలో విడుదల చేశారు.
'వివేకా హత్య పాత్రధారుడు అవినాష్‌రెడ్డి వెనకున్న అసలు సూత్రధారుడు జగన్. హాలీవుడ్ సినిమాల్లో సైతం చూడలేనివిధంగా వివేకా హత్యకు జగన్ వ్యూహాలు రచించారు. వివేకా హత్య కేసు నిందితులు ఆరోజు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని దాఖలు చేసిన అఫిడవిట్ లో ఉంది. ఇప్పటికైనా మౌనం వీడి జగన్ సమాధానం చెప్పాలి.'- బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు
పోలీసులపై పోరాటం : సైకో జగన్ నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బీసీ నేతలు ఈ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులతో టార్చర్ పెట్టిస్తూ.. బీసీలను భయబ్రాంతులకు గురి చేస్తుందని ఆక్షేపించారు. ప్రజా స్వామ్యమాన్ని రక్షించవలసిన పోలీసులు జగన్‌కు కొమ్ము కాస్తూ.. వైసీపీ నేతల అరాచకానికి ఆజ్జ్యం పోస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులపై కోర్టులో పోరాటం చేస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు.
ఇవీ చదవండి: