TDP Leader Achchennaidu letter to CS Jawahar Reddy: లిక్కర్ అమ్మకాలు, ఆదాయాల డేటా వెబ్సైట్ ను తొలగించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకతకు పాతరేస్తోందని మండిపడ్డారు. ప్రజల ముందు ఉంచాల్సిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతోందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకత, జవాబుదారీతనాన్ని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోంది - రాష్ట్రంలో అధికార దుర్వినియోగం : టీడీపీ
రహస్యంగా లిక్కర్ డేటా: లిక్కర్ అమ్మకాలు, ఆదాయాలకు సంబంధించిన డేటాను వైసీపీ ప్రభుత్వం వెబ్సైట్ నుంచి తొలగించిందని తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. లిక్కర్ ఆదాయం ఎక్కడికి వెళుతోందో మీకు తెలుసే ఉంటుందని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా పారదర్శకత కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే అమ్మకాలు చేస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు వారి రాజకీయ లబ్ది కోసం అధికారులు తప్పులు చేసేలా ఒత్తిడి చేస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. రాజకీయ నాయకులు ఒత్తడిలకు తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోందని ఆక్షేపించారు. కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు, లిక్కర్ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్ డేటాను వెబ్సైట్ నుంచి తొలగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పనిచేసేలా చూడండని హితవు పలికారు. లిక్కర్ అమ్మకాల, ఆదాయాలకు సంబంధించిన డేటా వెబ్ సైట్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
“లంచం అడగటం నేరం - కానీ ఎమ్మెల్యేలు అడిగితే ధర్మం" ఇదీ వైసీపీ ప్రభుత్వ తీరు
ఓటర్ బాబితాలో తప్పులు: టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, కోనేరు సురేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. పాతపట్నం, కనిగిరి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలోని తప్పులు, సమస్యల్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పాతపట్నం నియోజకవర్గంలో వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించకపోవడంపై నేతలు వివరణ కోరారు. బూత్ నెం 202లో వలసవెళ్లిన వారి 49 ఓట్లు తక్షణమే తొలగించేలా చూడాలని ఈసీకి నేతల విజ్ఞప్తి చేసారు. కనిగిరిలో గంపగుత్తగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు నమోదు కావడంపై ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఐడీలతో ఓట్ల తొలగింపు దరఖాస్తులు నమోదు చేశారని ఆరోపించారు. 191, 192 బూత్ లలో 249 ఓట్ల తొలగింపు దరఖాస్తులు నమోదు కావడంపై వెంటనే చర్యలు తీసుకొని, తప్పు చేసిన అధికారులు, ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఈసీ ముఖేశ్ కుమార్ మీనాను కోరారు.