ETV Bharat / state

CBN Letter to Union Minister: అటవీ భూములు అన్యాక్రాంతం.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ

TDP chief Chandrababu letter to the Union Environment Minister: అల్లంచెర్లరాజుపాలెంలోని అటవీ భూముల ఆక్రమణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఫారెస్ట్ భూమిని అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

CBN
CBN
author img

By

Published : Jul 15, 2023, 5:07 PM IST

TDP chief Chandrababu letter to the Union Environment Minister: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై, అన్యాయాలపై, అక్రమాలపై, ఆక్రమణలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రజలకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖల రూపంలో వివరాలను వెల్లడిస్తూ.. తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తున్నారు. తాజాగా అల్లంచెర్లరాజుపాలెంలోని అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ.. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆ లేఖలో భూమిల్ని అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన అధికారుల గురించి, వైసీపీ ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరు గురించి వివరించారు.

అల్లంచెర్లరాజుపాలెం అటవీ భూముల ఆక్రమణలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు చంద్రబాబు లేఖ.. పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజుపాలెంలోని అటవీ భూముల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో.. అల్లంచెర్లరాజుపాలెం గ్రామంలోని పాత సర్వే నెంబర్.453లో పర్యావరణ పరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతం అవుతోందని ఆయన ఆరోపించారు. అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతం కింద 3,255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీ శాఖ అధీనంలో ఉందని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులు కొంతమేర అటవీ భూమిని గతంలో సాగు భూమిగా ప్రకటించారని గుర్తు చేశారు. న్యాయ సూత్రాలకు విరుద్దంగా రెవెన్యూ అధికారులు నాడు తీసుకున్న నిర్ణయంపై కోర్టులలో వివాదావు నడుస్తున్నాయని చంద్రబాబు తెలియజేశారు.

అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.. ఈ క్రమంలో దీన్ని ఆసరాగా చేసుకుని తాజాగా అల్లంచెర్ల రాజుపాలెం పాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలోని 226, 227, 231, 232, 233 సర్వే నంబర్లలోని భూమి తమ ఆధీనంలో ఉందని.. ఆక్రమణదారులు, వారి వారసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్న చంద్రబాబు.. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసి, బోరు బావులు తవ్వుతున్నారని వివరించారు. తద్వారా భూమి తమ ఆధీనంలో ఉందని, దానిని అటవీ భూమిగా ప్రకటించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తప్పుడు వాదనలకు దిగుతున్నారని తెలిపారు. అటవీ భూముల ఆక్రమణకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు, అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.

కేంద్రం స్పందించి అటవీ భూములను కాపాడాలి.. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ శాఖ వెంటనే స్పందించి.. ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు కోరారు. తక్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి, స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలని గుర్తు చేశారు. భూ కబ్జాదారులను నుంచి అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి అక్కడ నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అల్లంచెర్లరాజుపాలెం ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.