ETV Bharat / state

తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం.. కాసేపట్లో ఆసుపత్రి నుంచి కీలక హెల్త్ బులిటిన్ - నారా లోకేశ్ పాదయాత్ర తారక రత్న

Nandamuri Taraka Ratna health condition : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణాన్నైనా వైద్యులు ఆయన ఆరోగ్యంపై.. కీలకమైన హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణతో పాటు తారకరత్న కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు.

Nandamuri Taraka Ratna
తారకరత్న హెల్త్​ బులిటెన్
author img

By

Published : Feb 18, 2023, 5:22 PM IST

Updated : Feb 18, 2023, 5:34 PM IST

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు తారకరత్న కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నకు ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోంది. ఆసుపత్రిలో చేరిననాటి నుంచి ఆయన ఆరోగ్యం కొంచం కొంచం కోలుకుంటోందని కుటుంబ సభ్యులు వెల్లడిస్తూ.. వచ్చారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బాబాయి బాలకృష్ణతో పాటు, కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరుకు చేరుకున్నారు. అటు వైద్యులు కూడా తారకరత్న ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రకటించారు. కాసేపట్లో హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి.

Nandamuri Taraka Ratna : జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన పాదయాత్రకు తన మద్దతు తెలిపేందుకు సినీ నటుడు నందమూరి తారకరత్న.. చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చారు. యువగళం పాదయాత్ర ప్రారంభం అనంతరం,లోకేశ్​కు అభినందనలు తెలిపి.. తాను కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన తర్వాత ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో.. తారకరత్నను వెనువెంటనే స్థానికంగా ఉన్న పీఈఎస్​ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను పరీక్షించేందుకు, బెంగుళూరు నుంచి ప్రత్యేక వైద్య బృందం హుటాహుటిన కుప్పం వచ్చింది. వైద్యుల సూచన మేరకు తారకరత్న భార్య కుప్పం వచ్చిన తర్వాత బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు, తుది నిర్ణయం తీసుకున్నారు. బాబాయి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉండి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చించి, ఆరా తీశారు. తొలిరోజు పాదయాత్ర అనంతరం లోకేశ్ కూడా సాయంత్రం తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వద్దే మకాం వేసిన బాలకృష్ణను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు బెంగూళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. నాటి నుంచి అక్కడే వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల విదేశీ వైద్యుల బృందం కూడా తారకరత్న ఆరోగ్యంను పరీక్షింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం యావత్తు బెంగుళూరుకి తరలివచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, నారా బ్రాహ్మణి, ప్రణతి తోపాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్​, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఆసుపత్రికి వచ్చారు.

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇటీవలే ఆసుపత్రికి వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నారాయణాలలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. శరీరావయవాలు చక్కగా స్పందిస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 18, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.