ETV Bharat / state

స్పందించని ప్రభుత్వం - కొనసాగుతున్న సమగ్ర శిక్ష సమ్మె - సమగ్ర శిక్ష సమ్మె

Statewide Samagra Siksha Employees Strike : సీఎం జగన్​ తన మొండి వైఖరితో క్షేమాన్ని మరిచి క్షోభకు గురిస్తున్నారని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ప్రపంచామంతా నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతే రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్​ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చారించారు.

strike
strike
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 8:45 PM IST

Statewide Samagra Siksha Employees Strike : సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె సైరన్​ 14వ రోజుకు చేరుకుంది. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ప్రతినెల ఒకటోవ తేది కల్లా వేతనాలు చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. విజయవాడ ధర్నా చౌక్​లో ఉరితాళ్లతో సమగ్ర ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ కోరికలు తీర్చకపోతే చావే శరణ్యమని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రగాల్బాలు పలికిన సీఎం జగన్​, 14 రోజుల పాటు సమ్మె జరుగుతున్నా ఒక్కసారి కూడా తమ సమస్యలపై అసలు మాట్లాడలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Guntur District : గుంటూరు కలెక్టరేట్​ ఎదుట సమగ్ర శిక్ష అధికారులు ఉరితాళ్లను మెడకు వేసుకొని నిరసనలు తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం జగన్​కు తమ సమస్యలకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చల పేరిట సమగ్ర శిక్ష ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

12వ రోజూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె - సంఘీభావం తెలిపిన అంగన్వాడీలు, కార్మికులు

Prakasam District : ఒంగోలు కలెక్టరేట్​ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మెడకి ఉరి తాడు బిగించుకొని సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. 14 రోజుల పాటు రోడ్డుపై ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వ మాత్రం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

Nellore District : న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమగ్ర శిక్ష ఉద్యోగులు నెల్లూరు కలెక్టరేట్​ వద్ద నిరసనలు తెలిపారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్​ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విభాగం ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చి తమ ఓట్లులను వేయుంచుకున్నారని ఆక్రోశించారు. సీఎం జగన్​ నాలుగున్నళ్లు పరిపాలన తమ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని వాపోయారు.

Annamaya District : సీఎం జగన్​ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టిన సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెర్చవేర్చాలని కోరుతూ అన్నమయ్య జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. మెడకు ఉరితాళ్లులతో తమ డిమాండ్​లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం పని భారం పెట్టిన విద్యాశాఖ విభాగంలో అన్ని పథకాలను ప్రజలకు చేరవేస్తు ప్రభుత్వాన్ని మంచి పేరును తీసుకువచ్చిన తమ గోడును ఎందుకు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్​ రెడ్డిని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

కొనసాగిన సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు ఆందోళనలు- కళ్లకు గంతలు కట్టుకొని, పవ్వులు చేవిలో పెట్టుకుని నిరసనలు

Anantapur District : 14వ రోజు అనంతపురంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి మెడకు ఉరితాళ్లతో ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 14 రోజులుగా మహిళలు సైతం రోడ్డుపైకి వచ్చే ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణం అన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి డిమాండ్లను తక్షణ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Kurnool District : తమను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కర్నూలులో 14వ రోజుకు చేరుకుంది. కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని, హెచ్ఆర్ఏ, డీఏ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం లోకి మార్చాలని, మెడికల్, చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని కోరారు.

Sathya Sai District : మాట తప్పను మడమ తిప్పను అంటూ పాదయాత్రలో అనేక హామీల వర్షాన్ని కురిపించి తీరా అధికారం వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా ఆర్డీవో కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరి తాళ్లు వేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చారించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.