ETV Bharat / state

Honor to justice Prashanth Kumar: జస్టిస్​ ప్రశాంత్​ కుమార్​ మిశ్రాకు.. ప్రభుత్వం ఘన సత్కారం

State Governmnet Honor to Justice PK Mishra: పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్​ జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ ,ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, సీఎం జగన్​​మోహన్​రెడ్డి హాజరయ్యారు.

Honor to justice Prashanth Kumar
Honor to justice Prashanth Kumar
author img

By

Published : Jun 23, 2023, 10:39 AM IST

Updated : Jun 23, 2023, 10:45 AM IST

జస్టిస్​ ప్రశాంత్​ కుమార్​ మిశ్రాకు.. ప్రభుత్వం ఘన సత్కారం

State Governmnet Honor to Justice PK Mishra: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్​ ప్రశాంత్​ కుమార్​ మిశ్రను.. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గౌరవార్థం విందు ఏర్పాటు చేసింది. గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్​ జస్టిస్​ అబ్దుల్​ నజీర్​,ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, సీఎం జగవ్​మోహన్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రను సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్​.. ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మంత్రులు తానేటి వనిత, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్​ జవహర్​ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం జస్టిస్​ మిశ్ర, ముఖ్యమంత్రి జగన్​ గ్యాలరీ నుంచి కొంచెం ముందుకు వచ్చి అక్కడే ఉన్న హైకోర్టు జడ్జ్​లను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో జస్టిస్​ మిశ్ర సతీమణి సుచేత, అడ్వొకేట్​ జనరల్​ శ్రీరామ్​ తదితరులు పాల్గొన్నారు.

డైనింగ్​ హాల్​లో విలేకరులు.. తెరపై వీక్షణమే: జస్టిస్​ ప్రశాంత్​ కుమార్​ మిశ్ర విందు కార్యక్రమానికి మీడియాను ప్రభుత్వం ఆహ్వానించింది. సుమారు 30మందికి పాస్​లు ఇచ్చారు. అయితే వారికి ప్రధాన సమావేశ మందిరంలోకి అనుమతి ఇవ్వలేదు. వెనుక ఉన్న డైనింగ్​హాల్​ లోనే కూర్చోవాలని స్పష్టం చేశారు. అక్కడ తెర ఏర్పాటు చేశామని.. అందులో వీక్షించాలని చెప్పారు. దీంతో విలేకరులంతా డైనింగ్​ హాల్​కే పరిమితం అయ్యారు.

మిశ్ర దంపతులను కలిసిన సీఎం జగన్​ దంపతులు: జస్టిస్​ మిశ్ర దంపతులను వారి నివాసంలో గురువారం సాయంత్రం సీఎం జగన్​ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జ్ఞాపిక అందించారు.

అధికారిక కార్యక్రమానికి వైసీపీ నేత దేవినేని అవినాశ్​: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు వైసీపీ నాయకుడు దేవినేని అవినాశ్​ హాజరు కావడం విశేషం. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన పలువురు అధికారులతో మట్లాడుతూ కనిపించారు. అనంతరం ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి.. జస్టిస్​ మిశ్రకు పుష్పగుచ్ఛం అందించారు.

న్యాయవాదుల ఘన సత్కారం: అలాగే జూన్​ 17వ తేదీన మంగళగిరిలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్స్​, లాయర్ల ఆధ్వర్యంలో.. జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రకు సన్మాన సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో.. జస్టిస్ ప్రశాంత్ కుమార్​తో కలసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేమని న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. ఏపీ ప్రజలు తనకు ఎంతో బాగా నచ్చారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 23, 2023, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.