ETV Bharat / state

మోదీ నాయకత్వంలో అభివృద్ధి.. జగన్​ నాయకత్వంలో అవినీతి: సోము వీర్రాజు - నరేంద్ర మోదీ

BJP Formation Day Celebrations : దేశ రాజకీయాల్లో అవినీతి అనే మురికిని పూర్తిగా తొలిగించి బీజేపీను విశ్వగురువుగా మార్చడానికి మోదీ పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొనియాడారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

BJP Formation Day Celebrations
BJP Formation Day Celebrations
author img

By

Published : Apr 6, 2023, 12:44 PM IST

Updated : Apr 6, 2023, 1:36 PM IST

మోదీ నాయకత్వంలో అభివృద్ధి.. జగన్​ నాయకత్వంలో అవినీతి

BJP Formation Day Celebrations : అవినీతి రహిత పాలనతో ప్రపంచ దేశాల్లోనే ప్రధాని మోదీ ఆదర్శంగా నిలిచారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. నీతివంతమైన పాలన కారణంగానే నేడు దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగుతోందని చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ జెండాను సోము వీర్రాజు ఎగురవేశారు. చారిత్రాత్మకమైన కొన్ని దృక్పథాలతో జన సంఘ్​ నుంచి జనతా పార్టీగా.. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్​ ఆరవ తేదీన ఈ పార్టీ ఏర్పడినట్లు సోము తెలిపారు.

దేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి: దేశ రాజకీయాల్లో అవినీతి అనే మురికిని పూర్తిగా తొలిగించి బీజేపీని విశ్వగురువుగా మార్చడానికి మోదీ పని చేస్తున్నారని కొనియాడారు. యోగా దినోత్సవాన్ని.. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడమే విశ్వగురువుగా మార్చడానికి తొలి సంకేతమన్నారు. భారతదేశంలో అమలవుతున్న అనేక కార్యక్రమాలను.. ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయని.. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. కరోనా కాలంలో 120 దేశాలకు వ్యాక్సిన్​ అందించిన ఘనత భారతదేశానికి, మోదీకే చెందుతుందని తెలిపారు.

"దేశ రాజకీయాల్లో అవినీతి అనే మురికి పూర్తిగా తొలగించాలి. బీజేపీని విశ్వగురువుగా మార్చాలని మోదీ పనిచేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడమే విశ్వగురువుగా మారడం. అవినీతి లేని రాజ్యాన్ని 19 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాం. జగన్ నాయకత్వంలో అవినీతి జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో బూడిద పేరుతో రూ.కోట్లు దండుకుంటున్నారు. బూడిదలో రూ.300 కోట్ల అవినీతి జరిగింది.. మొన్ననే పరిశీలించాం. కృష్ణా నదిలోనే రోడ్లు వేసి ఇసుక తవ్వేసే పరిస్థితి నెలకొంది" -సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

బూడిదలో 300కోట్ల రూపాయల అవినీతి: మోదీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతుంటే.. జగన్ నాయకత్వంలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో బూడిద పేరుతో కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. బూడిదలో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ మధ్య కాలంలోనే తాము బుడిద ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. కృష్ణా నదిలోనే రోడ్లు వేసి ఇసుకను తవ్వేసే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో వాడవాడలా బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అందరూ కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి.. వైసీపీ తరిమికొట్టేలాగా పని చేయాలని సూచించారు అనంతరం పార్టీ అవిర్బావ దినోత్సం సందర్భంగా ప్రధాని మోదీ.. బీజేపీ నేతలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 6, 2023, 1:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.